టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ బాధితుల ఫిర్యాదుతో బుక్కైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మాజీ మీడియా బాస్ అక్రమాలపై బాధితులు రోడ్డెక్కారు.. ఏపీ ప్రభుత్వం ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో రవిప్రకాష్ మోసాలపై కృష్ణా జిల్లా కూచిపూడి బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులపై సీరియస్ గా విచారణ చేయడానికి జగన్ సర్కార్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ సర్కారు త్వరలోనే సంజీవని ఆస్పత్రి పేరిట రవిప్రకాష్ చేసిన మోసంపై విచారణ చేయడానికి ప్రత్యేకంగా ఒక దర్యాప్తు బృందం(సిట్) వేయడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే రవిప్రకాష్ డొంక కదలడం గ్యారెంటీ అని చర్చ జరుగుతోంది.

సిలికానాంధ్ర ట్రస్ట్ పేరిట టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పేదలకు ఉచిత వైద్యం అందిస్తానని కూచిపూడిలో ‘సంజివనీ’ ఆస్పత్రిని నెలకొల్పాడు. దాదాపు 150 గ్రామాలకు ఉచితంగా ప్రపంచ స్థాయి ఆధునిక వైద్య సేవలను అందిస్తామని కూచిపూడి లో స్థలం కోసం రవిప్రకాష్ ,కూచిబొట్ల ఆనంద్ బ్యాచ్ స్థానికులను నమ్మించారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి తెలుగు విశ్వవిద్యాలయం ఆధీనంలో ఉన్న ఎకరం స్థలాన్ని కొట్టేశారని గ్రామస్థులు ఆరోపిస్తుంటారు. దేశ, విదేశాల్లోని ఎన్ఆర్ఐ లను ఈ ఆస్పత్రి కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక రవిప్రకాష్, కూచిబొట్ల ఆనంద్ మాటలను నమ్మి కూచిపూడి స్థానికులు కూడా తమ వంతు విరాళాలిచ్చారు. విదేశాలనుండి వసూలైన విరాళాలతో పాటు స్థానికంగాను, ఇతర ప్రాంతాల్లోని ప్రముఖ వ్యక్తులు,సంస్థల నుండి మీకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని వందల కోట్లవరకు సేకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

కూచిపూడి సమీప గ్రామాలకు, విరాళాలు అందించిన వారికి ఉచిత వైద్యం అందించకుండా కనీస సదుపాయాలు కల్పించకుండా రవిప్రకాష్ ఆస్పత్రిని భ్రష్టు పట్టించాడని సమీప గ్రామాల వారు ఆరోపిస్తున్నారు. ఉచిత వైద్యం పేరిట రవిప్రకాష్ మోసం చేశాడని ఇప్పుడు బాధితులంతా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

దీంతో జగన్ సర్కారు ఈ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసింది. ఉచిత వైద్యం పేరుతో రవిప్రకాష్ చేసిన మోసాలు, ఆగడాలు, సంజీవని ఆస్పత్రి సంగతి తేల్చడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

Comments

comments

Leave a Reply

*