వంశీకృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్న ‘ది ట్రిప్’ సినిమా ట్రైలర్‌కు అనూహ్య స్పందన..

ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో VDR ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మిస్తున్న సినిమా ది ట్రిప్. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. దీనికి కూడా అనూహ్య స్పందన వస్తుంది. భిన్నమైన కథాంశంతో వంశీ కృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలు పెంచేస్తుంది. ఓ ట్రిప్‌లో భాగంగా హీరోకు ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ట్రైలర్ చూస్తుంటే రొటీన్‌కు కాస్త భిన్నంగానూ అనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. కార్తిక్ కొడకండ్ల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బొంతల నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు.. విశ్వ దేవబత్తుల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

నటీనటులు: ఆమని, గౌతమ్ రాజ్, సౌమ్య శెట్టి తదితరులు

టెక్నికల్ టీమ్:
దర్శకుడు: వంశీకృష్ణ ఆకెళ్ల
నిర్మాత: దుర్గం రాజమౌళి
నిర్మాణ సంస్థ: VDR ఫిల్మ్స్
సంగీత దర్శకుడు: కార్తిక్ కొడకండ్ల
ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి
సినిమాటోగ్రఫీ: విశ్వ దేవబత్తుల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here