నిర్మాతగా తొలి అడుగు వేస్తున్న అల్లు బాబి ఉరఫ్ వెంకటేష్..

మెగా నిర్మాత అల్లు అరవింద్ గారి పెద్దబ్బాయిగా బాబి గారు అందరికీ సుపరిచితమే. అయితే ఆయన గురించి ఇక్కడ కొన్ని విషయాలు అందరికీ చెప్పాలి. కొండంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న అల్లు బాబి గారు.. తనకంటూ సొంత గుర్తింపు కోసం ఇప్పటికే ఎన్నో సాధించారు. ఐటీ మీడియా రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు అల్లు వెంకటేష్ గారు. గీతా ఆర్ట్స్ సినీ నిర్మాణంలో కూడా తెర వెనక తన పాత్ర సమర్ధవంతంగా పోషించారు. లండన్, ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసి.. టెక్నాలజీ ఇంటర్ ప్రీటర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు. అదే రంగంలో దాదాపు 15 సంవత్సరాల పాటు ఉండి ఎన్నో సరికొత్త ఆలోచనలకు తెరతీశారు. ఈ క్రమంలోనే ఎన్విరాన్మెంట్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లాంటి ఎన్నో సరికొత్త ఆలోచనలతో ఒకటిన్నర దశాబ్దం పాటు ఐటీ రంగంలో తన వంతు కృషి చేశారు. ఆ తర్వాత మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లో సినిమాటిక వంటి ఇన్నోవేటివ్స్ ప్రారంభించారు.

జస్ట్ టికెట్స్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ టికెట్స్ అమ్మకానికి అంకురార్పణ చేసి.. ప్రస్తుతం దానికి చైర్మన్గా కొనసాగుతున్నారు అల్లు వెంకటేష్ గారు. అలాగే గీతా ఆర్ట్స్ లో వచ్చే ప్రతి సినిమాకు తన వంతు బాధ్యతగా తెరవెనుక ఎంతో కృషి చేస్తారు అల్లు బాబీ. తెలుగువారి తొలి ఓటిటి ఆహా కోసం టెక్నాలజీ పరంగా ఎన్నో మెళుకువలు అందించారు. అలాగే ప్రాడక్టు స్ట్రాటజీ విషయంలోనూ.. అది ప్రేక్షకుల్లోకి విజయవంతంగా రావడానికి రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు అల్లు బాబి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంతో పాటు సినిమా రంగంలోనూ గత 15 ఏళ్లుగా ఎన్నో విజయాలు అందుకుని తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అల్లు వెంకటేష్ గారు. ఇక ఇప్పుడు నిర్మాతగా గని సినిమాతో తెర ముందుకు వస్తున్నారు ఆయన. ఇక్కడ కూడా ఆయన అద్భుతమైన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అల్లు వెంకటేష్ గారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here