ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా విడుదలైన ‘లవ్ మౌళి’ హీరోయిన్ ఫంకూరీ గిద్వానీ టీజర్..

నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ మౌళి. ఈ చిత్రంలో నవదీప్, ఫంకూరీ గిద్వానీ జంటగా నటిస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా హీరోయిన్ ఫంకూరి గిద్వాని ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. హీరోయిన్ కూడా చాలా అందంగా ఉన్నారు. మరోవైపు ఈ సినిమా కోసం పూర్తిగా కొత్తగా మారిపోయారు నవదీప్. ఈ సినిమాతో నవదీప్ 2.0 గా క‌నిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన లవ్ మౌళి సినిమా ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా అవనీంద్ర చూసుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

నటీనటులు:
నవదీప్, ఫంకూరీ గిద్వానీ తదితరులు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here