కామూరి ర‌మ‌ణారెడ్డి వైపు చూస్తోన్న వైఎస్సార్సీపీ అధిష్టానం

ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నారాంబాబుపై వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నారు. ఆయ‌న‌పై నియోజ‌క వ‌ర్గంలో రోజు రోజుకి వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఈ ప‌రిస్థితిపై అరా తీసిన‌ వైఎస్సార్సీపీ అధిష్టానం ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ అభ్య‌ర్థి మార్పు ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో స్వ‌చ్ఛంద సేవ కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌యిన కామూరి ర‌మ‌ణారెడ్డి పై అధిష్టానం దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న పార్టీ కోసం చేస్తోన్న ప‌నితీరుపై ఇప్ప‌టికే ఓ అంచ‌నాల‌కువ‌చ్చి సంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. మ‌రోవైపు పీకే టీమ్ స‌ర్వే రిపోర్టు కూడా కామూరి ర‌మ‌ణారెడ్డి పేరును సూచించింది. దీంతో వ‌చ్చే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో గిద్ద‌లూరు నియోజకవ‌ర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా కామూరి ర‌మ‌ణారెడ్డికి సీటు గ్యారెంటీగా ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ అధిష్టానం సుముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

కామూరి ర‌మ‌ణారెడ్డి నిరంత‌రం సేవాకార్య‌క్ర‌మాలతో పాటు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌టం కూడా ఆయ‌న‌కు క‌లిసివ‌చ్చే అంశం . అంతేకాదు రాజ‌న్న‌ భోజ‌నశాల పేరుతో నియోజ‌క‌వ‌ర్గంలోని పేద ప్ర‌జ‌ల‌కు ప్ర‌తిరోజు ఐదు రూపాయ‌ల‌కే భోజ‌నాన్నిఅందిస్తున్నారు. ఏ స‌హ‌యం కొరి వ‌చ్చిన వెనువెంటే చెయ్యూత‌నిచ్చి, ఆదుకునే వ్య‌క్తిగా పేరుతెచ్చుకున్నారు . దీంతో ఆయ‌న‌కు అసెంబ్లీ సీటును ఖ‌రారు చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది .

వైఎస్సార్సీపీ పురుడుపోసుకున్న స‌మ‌యం నుంచి ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల్లో నిత్యం పాల్గొంటుసేవ‌లందిస్తున్నారు. ఈ నియోజ‌క వ‌ర్గంలోని కొంద‌రు రాజ‌కీయ‌నేత‌లు, పార్టీలు పార్టీలు మారుతున్నా ఆయ‌న మాత్రం వైఎస్సార్సీపీని వీడ‌లేదు. మొద‌టి నుంచి వైఎస్ జ‌గ‌న్ వెంటేన‌డుస్తున్నారు. రాబోయే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కామూరి ర‌మ‌ణారెడ్డి వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్య‌ర్థిగా నిల‌బెట్టే ఛాన్సు ఎక్కువ‌గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here