అష్ట సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై విశ్వాంత్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం..

అష్ట సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై విశ్వాంత్, గోపిక ఉదయన్ జంటగా కులదీప్ కుమార్ రజన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సినిమాను సిరి సమర్పిస్తుండగా.. దేవు సత్యనారాయణ, ప్రతాప్ రెడ్డి అధురి, షేక్ రహీమ్ నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రవిమణి కే నాయుడు సినిమాటోగ్రఫర్. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. ఆదిత్య భార్గవ్ ఈ సినిమాకు రైటర్. కులదీప్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లేతో పాటు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here