`కథ కంచికి మనం ఇంటికి` మూవీ రివ్యూ

నటీనటులు: త్రిగుణ్ (అదిత్ అరుణ్), పూజిత పొన్నాడ, ఆర్జే హేమంత్, గెటెప్ శ్రీను, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, సాహితి తదితరులు.
డైరెక్టర్: చాణక్య చిన్న
మ్యూజిక్: బీమ్స్ సిసిరోలియో
డి.ఓ.పి: వైయస్ కృష్ణ
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: శ్రీనివాస్ తేజ
ఫైట్స్: షావోలిన్ మల్లేష్
ప్రొడ్యూసర్: మోనిష్ పత్తిపాటి

అదిత్‌ అరుణ్‌ పేరు మార్చుకున్నాక(త్రిగుణ్‌) వస్తున్న చిత్రం `కథ కంచికి మనం ఇంటికి`. పూజిత పొన్నాడ కథానాయికగా ఆర్జే హేమంత్‌, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో చాణక్య చిన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. హర్రర్‌ కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం(ఏప్రిల్‌ 8)న విడుదలైంది. మరి సినిమా ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

హీరోగా సరైన గుర్తింపు, సక్సెస్‌ రావడం లేదని, తన కెరీర్‌ని మళ్లీ ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలని త్రిగుణ్‌గా పేరు మార్చుకున్నారు అదిత్‌ అరుణ్‌. ఆయన పేరు మార్చుకున్నాక విడుదలవుతున్న సినిమా `కథ కంచికి మనం ఇంటికి`. పూజిత పొన్నాడ కథానాయికగా నటించిన ఈ హర్రర్‌ కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రానికి చాణక్య చిన్నా దర్శకత్వం వహించారు. మోనిష్‌ పత్తిపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్‌ 8)న విడుదలైంది. మరి ఇప్పటికే వచ్చిన అనేక హర్రర్‌ కామెడీ సినిమాలకు ఇది భిన్నంగా ఉందా? ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసిందా? అనేది `కథ కంచికి మనం ఇంటికి` చిత్ర రివ్యూలో తెలుసుకుందాం.

కథః
శృంగార పురుషుడైన తాత అనేక మంది ఆడవారితో సంబంధాలు పెట్టుకుని తన ఆస్తిని మొత్తం వారికే రాసిచ్చి తనని మాత్రం రోడ్డున పడేశాడని బాధ పడుతుంటాడు ప్రేమ్‌(త్రిగుణ్‌). తనకు పెళ్లి కావడం లేదని, తనకు ఏ ఒక్క అమ్మాయి కూడా పడటం లేదని, తన జీవితం ఎండుటాకుల మారిపోయిందని బాధ పడుతుంటాడు. అమ్మాయిలను పడేయడం, ఆంటీలైనా సరే పెళ్లి చేసుకుందామని యావలో తిరుగుతుంటాడు. మరోవైపు క్రేజీ బెట్టింగ్‌లతో తన లైఫ్‌లో క్రేజ్‌ని పొందుతూ ఫ్రెండ్స్ వద్ద డబ్బులు కొట్టేస్తుంది దీక్ష(పూజిత పొన్నాడ). ఇంకో వైపు సినిమా దర్శకుడిగా రాణించాలని కథలు రాస్తూ, వాటిని పట్టుకుని నిర్మాతల చుట్టూ తిరుగుతుంటాడు నంది(ఆర్జే హేమంత్‌). మరోవైపు దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటాడు దొంగేష్‌(గెటప్‌ శ్రీను). ఈ నలుగురు ఓ రాత్రి శ్మశానంలో కలుసుకుంటారు. ఒకరినొకరు దెయ్యాలుగా భ్రమ పడి, తీరా తాము మనుషులమే అని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ రాత్రి పక్కనే ఉన్న ఓ గెస్ట్ హౌజ్‌లోకి వెళ్తారు. అక్కడ దెయ్యం వీరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టింది. ఆ దెయ్యం కథేంటి? చైల్డ్ ట్రాఫికింగ్‌(అనాథ మైనర్‌ బాలికలపై అత్యాచారాలు) కి, ఈ కథకి సంబంధమేంటనేది మిగిలిన సినిమా.

నటీనటులుః

ఈ సినిమాలో కనిపించేటటువంటి మెయిన్ లీడ్ లో నలుగురు నటులు కూడా మంచి పెర్ఫామెన్స్ లని అందించారు. మొదటగా హీరో త్రిగుణ్ కోసం చెప్పుకున్నట్టయితే తన ఈ సినిమాలో మంచి నటనను కనబరిచాడు.తన లుక్స్ పరంగా గాని బాడీ లాంగ్వేజ్ గాని బాగున్నాయి. అలాగే హీరోయిన్ పూజితా అయితే తనలోని బెస్ట్ ని అందించింది. స్క్రీన్ పై ఆమె అందంగా కనిపిస్తూ నీట్ గా నటనను కనబరిచింది.

ఇంకా హేమంత్ కూడా తనకిచ్చిన రోల్ ని కంప్లీట్ గా ఫుల్ ఫిల్ చేసి చూపించాడు. ఇక గెటప్ శ్రీను రోల్ అయితే సినిమాలో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తనపై కామెడీ సీన్స్ అన్నీ కూడా బాగున్నాయి. అలాగే తన నటన కోసం చెప్పాల్సిన పని కూడా లేదు. వీరితో పాటుగా సినిమాలో ఇంపార్టెంట్ రోల్(దయ్యం) లో కనిపించిన అమ్మాయి కూడా అనేక షేడ్స్ తో సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించింది.

సాంకేతిక వర్గం పనితీరుః
ఈ చిత్రం తక్కువ బడ్జెట్ చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. అలాగే టెక్నికల్ టీం లో సంగీత దర్శకుడు భీమ్స్ వర్క్ మాత్రం సినిమాకి చాలా ప్లస్ అయ్యిందని చెప్పాలి. తన మ్యూజిక్ వల్ల సినిమా కొద్దో గొప్పో పలు చోట్ల ఆసక్తిగా అనిపిస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో బాగా చెయ్యాల్సింది.

ఫైనల్ గా దర్శకుడు చాణక్య చిన్నా విషయానికి వస్తే తాను సినిమాలో మెయిన్ లీడ్ కి మంచి పత్రాలు రాసుకొని వాటిని బాగానే ప్రెజెంట్ చేసాడు. కానీ తన కథలో కానీ కథనంలో కానీ ఎలాంటి కొత్తదనం లేవు. అదే రొటీన్ మెసేజ్ హారర్ కామెడీ కథను తీసికొచ్చాడు. ఓవరాల్ గా అయితే తన వర్క్ తో ఇంప్రెస్ చేసాడు .

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కథ కంచికి మనం ఇంటికి” చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకుంది . ఈ చిత్రం లో నవ్వులు మెయిన్ లీడ్ నలుగురు నటుల సిన్సియర్ పెర్ఫామెన్స్ లు ఆకట్టుకుంటాయి. చివరగా మంచి కామెడీ హర్రర్ మూవీ చూసాం అన్న ఫీలింగ్ కలుగుతుంది

రేటింగ్‌ః 3.0/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here