మంగ‌ళ‌గిరి NRI హాస్పిట‌ల్ లో భారీ గోల్ మాల్ బట్టబయలు

పోలీసుల విచారణలో బయటపడిన బాగోతం

కోవిడ్ కాలంలో కోట్ల‌ను కొల్ల‌కొట్టిన కొంద‌రు మాజీడైరెక్ట‌ర్లు

భారీ మొత్తంలో అకాడ‌మీ సొమ్ము లూఠీ

న‌కిలీ ఖాతాల‌తో నిధుల మ‌ళ్లింపు

దోపిడీపై ఆరా తీసి చార్జీషీట్ దాఖలు చేసిన పోలీసులు

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో భారీ కుంభ‌కోణం వెలుగు చూసింది.కోవిడ్ స‌మ‌యాన్ని అదునుగా చేసుకుని, దాదాపుగా 50 కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌కొట్టిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది.ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌,డాక్ట‌ర్ మణి అక్కినేని,ఛీప్ కో ఆర్డినేటింగ్ ఆఫీస‌ర్ ఉప్ప‌ల శ్రీనివాస‌రావు, చీఫ్ పైనాన్సింగ్ ఆఫీస‌ర్ న‌ళిని మోహ‌న్ , ఓ గ్యాంగ్ గా ఏర్ప‌డి మోసానికి పాల్ప‌డిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. ఎన్ ఆర్ఐ ఆకాడ‌మీ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ నిధుల‌తో పాటు కోవిడ్ స‌మ‌యంలో రోగుల చెల్లింపుల్లో గోల్ మాల్ కు పాల్ప‌డిన‌ట్లు అంత‌ర్గ‌త విచార‌ణ‌లో తేలింది.

దోపిడీకి పాల్ప‌డింది ఇలా!
ఇంటి దొంగ‌ను ఈశ్వ‌రుడైన ప‌ట్ట‌లేరు అన్న నానుడి వుంది. అదే విష‌యాన్ని అప్లై చేసిన ఈ మాజీ డైరెక్ట‌ర్లు ఎన్ ఆర్ ఐ ఆస్ప‌త్రి లో భారీ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారు. కోవిడ్ సమయంలో నకిలీ ఇన్వాయిస్ లతో అక్ర‌మాల‌కు పాల్పడినట్టు తెలిసింది.

24-09-2020న ఒక రిటైర్డు జ‌స్టిస్, ఆయ‌న స‌తీమ‌ణిని ఎన్ ఆర్ ఐ ఆస్ప‌త్రిలో చేరారు. చికిత్స నిమిత్తం 2 ల‌క్ష రూపాయ‌ల అడ్వాన్స్ పేమెంట్ చేశారు. వైద్య‌నిమిత్తం ఖ‌ర్చు చేసిన మొత్తాన్ని తెలంగాణ హైకోర్టు, ఎన్ఆర్ ఐ ఆసుపత్రికి చెల్లించింది. ఈ క్రమములో అడ్వాన్స్ పేమెంట్ ని తిరిగి ఇవ్వాలని సదరు రిటైర్ జస్టిస్ అడగడంతో , ఆయన అడ్వాన్స్ అమౌంట్ అకౌంట్స్ రికార్డ్స్ లో నమోదు చేయలేదని వెల్లడైంది. ఆస్ప‌త్రి చెల్లింపు పుస్త‌కాన్ని ప‌రిశీలించ‌గా, రిటైర్డు జ‌స్టిస్ చెల్లించిన 2ల‌క్ష‌ల రూపాయ‌లు,మ‌రో HIMS బుక్ లో రికార్టు అయింది. మొత్తం పేషెంట్లు వివ‌రాలు చెల్లింపులపై విచారించ‌గా, భారీ అవ‌క‌త‌వ‌క‌లు వెలుగుచూశాయి. సుమారు 1500 మంది పేషెంట్ల రికార్టుల‌ను కంప్యూటర్ లో ఎంటర్ చేయనట్టు గుర్తించారు ఎన్ ఆర్ ఐ అకౌంటెంట్ విభాగం. ఆ త‌రువాత జ‌రిపిన అంత‌ర్గ‌త విచార‌ణ‌లో నకిలీ రికార్డులతో కోట్లు రూపాయ‌ల‌ను దారి మ‌ళ్లించిన‌ట్లు తేలింది.

మ‌రో వైపు ఎన్ఆర్ ఐ ఎఎస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని క్రియేట్ చేసిన డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్‌, డాక్టర్ మణి అక్కినేని న‌కిలీ ఇన్వాయిస్ లను త‌యారు చేసి ఎన్ ఆర్ ఐ కి చెందాల్సిన 62 ల‌క్ష‌ల‌72 వేల‌172 రూపాయ‌ల‌ను స్వాహా చేసిన‌ట్లు తేలింది. అంత‌టితో ఆగ‌కుండా కోవిడ్ ఇన్సోలేషన్ వార్డ్ కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ & ఇన్ ప్రాస్ట‌క్చ‌ర్ మొబైలే జెషన్ కోసం మంజూరు చేసిన రెండు కోట్లు రూపాయ‌ల‌ను, ఫేక్ కంపెనీ అకౌంట్ ద్వారా ప‌క్క‌దారి మ‌ళ్లించారు.

అలాగే ఓ భవన నిర్మాణ సంస్థ రత్నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కి 33 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్ ఇచ్చింది. ఆ సంస్థ‌కు ఏప్రిల్ 2019 లో 4 కోట్ల రూపాయల అడ్వాన్స్ పేమెంట్ చేసారు. ఈ బిల్డింగ్ సంబందించిన కట్టడంకానీ, ఇప్పటికి ఎటువంటి సివిల్ వర్క్ కూడా జరగలేదు.
మ‌రోవైపు మెడిక‌ల్ కాలేజీ యాజ‌మాన్యం కోటా లో సీట్ల‌ను అక్ర‌మ మార్గంలో అమ్ముకుని అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు కూడా తేలింది. అంతేకాదు డాక్టర్ మణి అక్కినేని విజయవాడలోని తన సొంత ఆసుపత్రికి ఖరీదైన పరికరాలు కోసం డమ్మీ కొనుగోలు ఆర్డర్లు ద్వారా ఎన్నారై ఆసుపత్రి సొమ్మును 75 లక్షలు క్లియర్ చేసినట్లు తేలింది. ఈ గ్యాంగ్ మోసాల‌పై ఎన్ ఆర్ ఐ ఆస్ప‌త్రి అంత‌ర్గ విచార‌ణ చేప‌ట్టిన అనంత‌రం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ఈ అవకతవకలపై ఛార్జిషీటు దాఖ‌లు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here