యూట్యూబ్‌లోకి అడుగుపెట్టిన అందాల అనసూయ..!

న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ ప్రారంభించి టాప్‌ యాంకర్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది అనసూయ. ఇక సినిమాల ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో అద్భుతమైన నటను ప్రదర్శించి తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది. ప్రస్తుతం ఇటు బుల్లి తెరపై, అటు వెండి తెరపై తళుక్కుమంటూ దూసుకెళుతోంది.

ఇక అనసూయ తాజాగా మరో అడుగు ముందుకేసి డిజిటల్‌ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. ‘అనసూయ భరద్వాజ్‌’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. తాజాగా తొలి ఎపిసోడ్‌ను విడుదల చేసిందీ స్టార్‌ యాంకర్‌. ‘నవస్ర్త’ పేరుతో ఓ వీడియోను రూపొందించింది. ఈ వీడియోలో మహిళల అవుట్‌ఫిట్‌కు సంబంధించిన వివరాలను చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా అనసూయ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు తెగ వైరల్‌గా మారాయి. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో దిగిన ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు బ్యూటీఫుల్‌ అనసూయ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి అనసూయ పోస్ట్‌ చేసిన ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here