పెళ్లి తర్వాత కాజల్‌ ఆ సినిమాల్లో నటించదా..?

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ముంబయికి చెందిన గౌతమ్‌ కిచ్లూ అనే వ్యాపారవేత్తను ఈ నెల 30న వివాహం చేసుకోనుంది. కరోనా నేపథ్యంలో అత్యంత నిరాడంబరంగా ఇంట్లోనే వివాహ వేడుక జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కాజల్‌ ఇంటిని మరమ్మత్తులు చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉంటే వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని కాజల్‌ చెప్పిన విషయం తెలిసిందే. కాజల్‌ ప్రస్తుతం కమల్ హీరోగా తెరకెక్కుతున్న `ఇండియన్-2`, మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య` సినిమాల్లో నటిస్తోంది.

అయితే ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత కాజల్‌ తన సినిమాల ఎంపిక విషయంలో ఆలోచనను మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గ్లామర్‌, కమర్షియల్‌ పాత్రలకే పరిమితమైన కాజల్‌.. ఇక నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న, ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాల్లో మాత్రమే నటించాలనుకుంటుందని సమాచారం. ఈ లెక్కన చూస్తుంటే ఇకపై అభిమానులు కాజల్‌ గ్లామర్‌ షోను మిస్‌ కానున్నారన్నమాట.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here