క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌తి సంవ‌త్స‌రం వేయించుకోవాలా..?

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ క‌నిపెడుతున్నారు. అయితే ఇది ఎప్పుడు వ‌స్తుందో క‌చ్చితంగా చెప్ప‌లేము. అయితే ఇప్పటికే ప‌లు వ్యాక్సిన్లు తుది ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో ఉన్నాయి. అయితే అంత‌వ‌ర‌కు నిబంధ‌న‌లు పాటిస్తూ జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే మంచిది.

అయితే క‌రోనా వ్యాక్సిన్‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం వేయించుకోవాలా అన్న సందేహాలు ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తే దీన్ని ప్ర‌పంచం మొత్తం స‌ర‌ఫ‌రా చేయ‌డానికి చాలా క‌ష్టం. ప్ర‌పంచ జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని ఎంత ప్ర‌ణాళికా బ‌ద్దంగా వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేసినా అంద‌రికీ అందించ‌డం స‌వాల్‌గా మారింది. ఈ ప‌రిస్థితుల్లో క‌రోనా వ్యాక్సిన్ ఒక్క‌సారి వేయించుకుంటే స‌రిపోతుందా లేదంటే ప్ర‌తి సంవ‌త్స‌రం వేయించుకోవాలా అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌తినిధి డాక్ట‌ర్ రిచ‌ర్డ్ మిహిగో క్లారిటీ ఇచ్చారు. కోవిడ్ 19కు ప్ర‌తి సంవ‌త్స‌రం వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవ‌స‌రం రాక‌పోవ‌చ్చ‌ని ఆయ‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఎందుకంటే ఇది ఇత‌ర ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్ వ్యాక్సిన్ల మాదిరి కాద‌న్నారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఎంత‌కాలం ఉంటుందో అంచ‌నా వేయ‌డం క‌ష్ట‌మ‌న్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం వ్యాక్సిన్ వెయ్యాల్సిన అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని తాము అభిప్రాయప‌డుతున్న‌ట్లు చెప్పారు. మ‌రి రానున్న రోజుల్లో క‌రోనా ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. దీన్ని బట్టి వ్యాక్సిన్ల వినియోగం ఆదార‌పడి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here