గుడ్ న్యూస్‌.. భారత్ అంత ఎక్కువ వ్యాక్సిన్ బుక్ చేసింద‌ట‌..

క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో భార‌త్ కీల‌క అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. దేశంలో పెరుగుతున్న క‌రోనా కేసులు ఓ వైపు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో అంద‌రి దృష్టీ వ్యాక్సిన్‌పైనే ఉంది. ఇక కేంద్ర ప్ర‌భుత్వం కూడా వ్యాక్సిన్‌పై తీవ్రంగా దృష్టి సారించింది.

అన్నిదేశాల్లో మాదిరిగానే భారత్‌లోనూ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దాని పంపిణీ కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లను ముమ్మరం చేశారు. తాజాగా భారత్‌లో కరోనా వ్యాక్సిన్ బుకింగ్‌నకు సంబంధించిన ఒక విషయం వెల్లడయ్యింది. కరోనా వ్యాక్సిన్ బుకింగ్ విషయంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్ ఇప్పటి వరకూ కరోనా వ్యక్సిన్‌కు సంబంధించి 160 కోట్ల కన్ఫర్మ్ డోసేజీలను ఆర్డర్ చేసింది. డ్యూక్ యూనివర్శిటీకి చెందిన లాంచ్ అండ్ స్కేల్ స్పీడోమీటర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం భారత్…ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్‌ డోసేజీలను అన్ని దేశాలను మించి అత్యధికంగా బుక్ చేసింది. భారత్… ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రోజెనికా వ్యాక్సిన్‌ను 500 మిలియన్ డోసులు (50 కోట్ల డోసులు) బుక్ చేసింది. అమెరికా కూడా ఇదే స్థాయిలో వ్యాక్సిన్ డోసులను బుక్ చేసింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రోజెనికా వ్యాక్సిన్‌ను యూరప్‌తో పాటు పలు దేశాలు కూడా బుక్ చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here