భోజ‌నం న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయిన పెళ్లి.. పెళ్లి కూతురు ఏం చేసిందో తెలుసా..

ఈ మ‌ధ్య‌న పెళ్లిళ్లు చిన్న‌చిన్న కార‌ణాల‌తో ఆగిపోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఆగిపోయిన ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పెళ్లిలో చేసిన భోజ‌నం న‌చ్చ‌క‌పోవ‌డంతో ఓ పెళ్లి ఆగిపోయింది. దీంతో ఈ విష‌యం ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లోజరిగిన ఒక వివాహ వేడుకలో గందరగోళం చోటుచేసుకుంది. వివాహానికి హాజరైన వరుని అక్కాచెల్లెళ్లకు విందులోని ఆహారపదార్థాలు నచ్చలేదు. ఈ నేపధ్యంలో వధువు సోదరుడు… వరుని అక్కాచెల్లెళ్లకు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఫలితంగా వివాహం జరగకుండానే వధువు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. దీంతో పోలీసులు ఇరువర్గాలవారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకపోయింది.

బులంద్‌షహర్‌లో ఒక వివాహ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లివారంతా డీజేకు ఆనందంగా నృత్యం చేశారు. ఇదేసమయంలో వరుని అక్కాచెల్లెళ్లు భోజనం చేద్దామని వెళ్లిగా, వారికి ఆ ఆహారం నచ్చలేదు. ఈ విషయాన్ని వారు ఆడపెళ్లివారికి తెలియజేశారు. ఇంతలో వధువు బావ ఈ విషయంలో కలుగజేసుకున్నాడు. దీంతో వరుని అక్కాచెల్లెళ్లు, వధువు బావ మధ్య వివాదం చోటుచేసుకుంది. వరుని అక్కాచెల్లెళ్లు వధువు సోదరునిపై దాడి చేశారు. ఇంతలో అక్కడున్న ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. వారు కల్యాణమండపానికి చేరుకుని, ఇరువర్గాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు రాజీపడేందుకు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. పైగా వధువు తరపువారు తాము వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి, పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here