బ్రిట‌న్‌లో రాముడు, సీత గురించి ఏమంటున్నారో తెలుసా..

శ్రీ‌రాముడు, సీత‌మ్మ గురించి ఇండియాలోనే కాదు బ్రిట‌న్‌లో కూడా చెప్పుకుంటున్నారు. లండన్‌లోని 10వ డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఐగ్లోబల్‌ దివాలి ఫెస్ట్‌ 2020 పేరుతో మూడు రోజుల పాటు ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా బ్రిటన్‌ ప్రధాని బొరిస్‌ జాన్సన్ మాట్లాడుతూ రాముడు, సీత గురించి వివ‌రించారు.

దీపావ‌ళి పండుగ వ‌స్తున్న నేప‌థ్యంలో మ‌నం యుద్దం చేయాల్సి ఉంద‌న్నారు. రాముడు రావ‌ణుడిపై యుద్ధం చేసి సీతా దేవితో క‌లిసి భార‌త్ చేరుకున్నార‌న్నారు. అప్పుడు ప్ర‌జ‌లు కొన్ని కోట్ల దీపాలు వెలిగించి దీపావ‌ళి జ‌రుపుకున్నార‌ని ప్ర‌ధాని తెలిపారు. అలాంటి యుద్ధ‌మే ఇప్పుడు మ‌న‌మంతా చేయాల‌ని చెప్పారు. ఇందుకు ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని కోరారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో త‌మ ప్రభుత్వం పెట్టిన ఆంక్షల మేరకు బ్రిటన్‌లోని భారతీయ ప్రజలు పండుగలను జరుపుకోవడం అభినందనీయమ‌న్నారు. రానున్న దీపావళి పండుగను కూడా ఇదే తరహాలో జరుపుకోవాలని ఆశిస్తున్నా. పండుగను వేడుకలా జరుపుకునే భారతీయులకు ఇది కొంచెం కష్టమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుందన్నారు.

బ్రిట‌న్‌లో క‌రోనా విజృభిస్తోంది. అక్క‌డ సెకండ్ వేవ్ క‌రోనా వైర‌స్ మొద‌లైంది. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ విధించింది. కాగా రానున్న దీపావ‌ళిని పుర‌ష్క‌రించుకొని 10వ డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఐగ్లోబల్‌ దివాలి ఫెస్ట్‌ 2020ని ప్రారంభించారు. కాగా బ్రిట‌న్ ప్ర‌ధాని నోటి నుంచి రాముడు, సీత అనే మాట‌లు వినిపించ‌డం ఇప్పుడు ఇండియాన్స్‌ని ఆక‌ర్షిస్తోంది. ఇత‌ర దేశాల దేవుళ్ల‌ను, సాంప్ర‌దాయాల‌ను ప‌క్క దేశాల ప్ర‌ధానులు గౌర‌వించ‌డం నిజంగా అభినందించే విష‌య‌మే. ఇక్క అక్క‌డ జ‌రుగ‌నున్న దివాళి ఫెస్టులో భార‌తీయ సంస్కృతికి సంబంధించిన ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here