అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో తానే గెలిచాన‌ని చెబుతున్న డొనాల్డ్ ట్రంప్‌..

హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రిదో తెలిసిపోయింది. ట్రంప్‌పై మెజార్టీతో జో బైడెన్ గెలిచిన విష‌యం తెలిసిందే. దీంతో గ‌త నాలుగు రోజులుగా నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. అయితే ట్రంప్ మాత్రం తానే గెలిచాన‌ని చెబుతున్నారు.

డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే ట్రంప్ విజ‌యం త‌న‌దేన‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంది. అధ్య‌క్ష్య పీఠానికి కావాల్సిన మ్యాజిక్ మార్క్‌ను బైడెన్ దాటేసి అంద‌రి ఉత్కంఠ‌కు ఫులిస్టాప్ పెట్టారు. అయితే ట్రంప్ మాత్రం త‌న మాటే నెగ్గాలంటున్నారు. 290 ఎలక్టోరల్ ఓట్లతో డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో పరాజయాన్ని తట్టుకోలేకపోతున్నారు.

ఎన్నికల్లో తానే గెలిచానని తాజాగా ట్వీట్ చేశారు. “కౌంటింగ్ గదిలోకి మా అబ్జర్వర్లను అనుమతించలేదు. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. నాకు 7 కోట్ల 10 లక్షల లీగల్ ఓట్లు వచ్చాయి. అమెరికా చరిత్రలో సిట్టింగ్ ప్రెసిడెంట్‌కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. నేనే గెలిచా” అని ట్రంప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా అమెరికా ఎన్నిక‌లు ఎన్న‌డూ లేనంత హోరాహోరీగా సాగాయి. యావ‌త్ ప్రపంచం మొత్తం ఈ ఎన్నిక‌ల గురించే ఆలోచించింది. స‌ర్వేలు చెప్పిన‌ట్లుగానే బైడెన్ విజ‌యం సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here