అమెరికాలో ట్రంప్ ఓట‌మికి మూడు ప్ర‌ధాన కార‌ణాలు..

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జో బైడెన్ విజ‌యం సాధించారు. మొన్న‌టి వ‌ర‌కు అధ్య‌క్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప‌రాజ‌యం పాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ ట్రంప్ తానే అధ్య‌క్షుడిన‌ని చెప్పుకుంటున్నారు. అయితే ట్రంప్ ఓట‌మికి ప్ర‌ధానంగా ప‌లు కార‌ణాలు ఉన్నాయి.

అమెరికాలో అధ్య‌క్షుడిగా ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి మ‌ళ్లీ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొనే వ‌రకు ప్ర‌తి అంశంలో వివాదాలే ఎదుర్కొన్నారు. ప‌లు సంస్క‌ర‌ణ తీసుకొచ్చి అమెరికా ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డం మాత్ర‌మే ట్రంప్ చేసిన మంచి ప‌ని. ఆ త‌ర్వాత ఆయ‌న ఏం చేసినా వివాదంగానే ఉన్నాయి. ప్ర‌ధానంగా క‌రోనా వ్యాధి విజృంభించిన స‌మ‌యంలో ట్రంప్ చేప‌ట్టిన చ‌ర్య‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్నారు. అగ్ర‌దేశం అని చెప్పుకోవ‌డ‌మే త‌ప్ప అధినేత ట్రంప్ ఏమాత్రం క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకోలేదు. దీనిపై అంద‌రి నుంచి ఆయ‌న మాట‌ప‌డ్డారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక కేసులు అమెరికాలో న‌మోద‌వ్వ‌డం చూస్తే అక్క‌డ ఏ విధంగా క‌రోనా జాగ్ర‌త్త‌లు ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక ట్రంప్ ఓట‌మికి మ‌రో కార‌ణం న‌ల్ల‌జాతీయులు ఆగ్ర‌హానికి గుర‌వ్వ‌డం. న‌ల్ల‌జాతీయుల‌కు భ‌ద్ర‌త విష‌యంలో ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌లు వారిని మ‌రింత ఆగ్ర‌హానికి గురిచేశాయి. ఇక ఐరోపా, ఆస్ట్రేలియా, జ‌పాన్ వంటి దేశాల‌తో విష‌యంలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు కూడా ట్రంప్‌కు ఎన్నిక‌ల్లో ఫ‌లితం చూపించింద‌ని చెప్పొచ్చు. ఇక ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు కూడా ఎన్నో వ‌చ్చాయి. ఆయ‌న మాట తీరు వ్యంగంగా ఉండ‌టం హద్దులు మీరింద‌నే చెబుతారు. దీన్ని బ‌ట్టి ట్రంప్‌కు ఏ విధంగా చూసుకున్నా వ్య‌తిరేక‌తే వ‌చ్చింది. ఇవ‌న్నీ ఒక్క‌సారిగా అమెరికా ప్ర‌జ‌లు ఎన్నిక‌ల స‌మ‌యంలో చూపించార‌నుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here