న‌రేంద్ర మోడీకి కొత్త ఫ్రెండ్‌.. మోడీ ఏమ‌న్నారో తెలుసా..

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి కొత్త మిత్రుడు వ‌చ్చాడు. ఆయ‌న అమెరికా ఎన్నిక‌ల్లో గెలిచి అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌. ఇన్నాళ్లూ త‌న మిత్రుడుగా ట్రంప్‌ను మోడీ చెబుతూ ఉండే వారు. అయితే ఎన్నిక‌ల్లో ట్రంప్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు బైడెన్ అమెరికా అధ్య‌క్షుడు అవుతున్న నేప‌థ్యంలో మోడీకి కొత్త మిత్రుడు వ‌చ్చార‌ని అంతా అనుకుంటున్నారు.

జో బైడెన్‌కు ప్ర‌పంచ దేశాల అధినేతల నుంచి శుభాకాంక్ష‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. భార‌త్ త‌రుపు నుంచి మోదీ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న‌తో క‌లిసి దిగిన ఓ ఫోటోను మోదీ షేర్ చేశారు. మోడీ ఏమ‌న్నారంటే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా బైడెన్‌కు కంగ్రాట్స్ చెప్పారు. “అద్భుత విజయం సాధించిన బైడెన్‌కు శుభాకాంక్షలు. ఉపాధ్యక్షుడిగా యూఎస్-ఇండియా సంబంధాల కోసం మీ సహకారం అమూల్యమైనది. ఇండో-యూఎస్ సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా నేను ఎదురు చూస్తున్నా” అని మోదీ ట్వీట్ చేశారు.

గ‌తంలో ట్రంప్‌తో ఎలాంటి మంచి సంబంధాలు ఉన్నాయో ఇప్పుడు బైడెన్‌తో అంత‌కంటే మంచి సంబంధాలు మోడీ కొన‌సాగించాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఉపాధ్య‌క్షురాలిగా గెలిచిన భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్‌కు కూడా మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.”అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన కమలా హ్యారిస్‌కు హృదయపూర్వక అభినందనలు. మీ విజయం చరిత్రాత్మకం. ఇది మీకే కాకుండా భారతీయ అమెరిక్లనందరికీ గర్వకారణం. మీ మద్దతు మరియు నాయకత్వంతో శక్తివంతమైన ఇండో-యూఎస్ సంబంధాలు మరింత బలపడతాయని నా నమ్మకం” అని మోదీ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here