ఆ ఒక్క రాష్ట్రంలోనే 10 కొత్త క‌రోనా కేసులు..

దేశంలో క‌రోనా స్ట్రెయిన్ కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన వారిని ప‌రీక్షించ‌గా ప‌లువురికి ఇప్ప‌టికే క‌రోనా స్ట్రెయిన్ సోకిన‌ట్లు తేలింది. అయితే అధికారులు భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో మాత్రం తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. దేశంలో ఇప్ప‌టికే 20 క‌రోనా స్ట్రెయిన్ కేసులు నమోద‌య్యాయి.

కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 10 మందికి కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ వచ్చినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిలో ముగ్గురు నొయిడాకు చెందిన వారు కాగా, మీరుట్, బరైలీలో చెరొకరు, ఘజియాబాద్‌లో ముగ్గురు ఉన్నారు. రెండేళ్ల పాపలో కరోనా స్ట్రెయిన్ లక్షణాలు బయటపడటంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అప్రమత్తమైనట్టు చెబుతున్నారు. స్టెయిన్ నేపథ్యంలో అదనపు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రంలోని అధికారులు, ఆసుపత్రి సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

కాగా, యూకే నుంచి ఇటీవల తిరిగి వచ్చిన వారికి ఆర్‌టీ-పీసీఆర్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చినప్పటికీ 28 రోజుల పాటు హోమ్ క్యారంటైన్‌లో ఉంచనున్నట్టు తెలుస్తోంది. యూపీ ప్రభుత్వ అడ్వయిజరీ ప్రకారం, కొత్త స్ట్రెయిన్ పాజిటివ్ పేషెంట్లను ఐసొలేషన్ వార్డుల్లో ఉంచుతున్నారు. మరోవైపు, బుధవారం ఉదయం దేశంలో 14 కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 8 కేసులు ఢిల్లీలో, 7 బెంగళూరులో నమోదయ్యాయి. వీరంతా ఇటీవల యూకే నుంచి తిరిగి వచ్చినవారే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here