న‌య‌న‌తార చెప్పే మాట‌లు న‌మ్మొచ్చా..

ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌ల వ‌రుస‌లో ఒక‌ప్పుడు సంద‌డి చేశారు న‌య‌న‌తార‌. ఒక్క హీరోయిన్ పాత్ర‌లోనే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీశారు ఆమె. ఇటు ల‌వ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో పాటు శ్రీ‌రామ‌రాజ్యం లాంటి సినిమాల్లో కూడా న‌యన ఒదిగిపోయారు.

తాజాగా న‌య‌న‌తార‌కు సంబంధించిన ఓ వార్త ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ మీద పోరాటం చేసిన తొలి రాణిగా వేలు నాచియర్ చరిత్రకెక్కారు. ఈమె జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ రూపొందుతోందని, అందులో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తోందని తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అది పూర్తిగా అవాస్తవమని నయనతార కొట్టిపారేసింది. వేలు నాచియర్ పాత్రలో నయనతార నటించడం లేదని తెలియజేస్తూ తాజాగా ఓ ప్రకటన విడుదలైంది. అది పూర్తిగా నిరాధారమైన వార్త. ఇలాంటి వార్తలను పబ్లిష్ చేసే ముందు సరి చూసుకోవాల్సిందిగా కోరుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. మ‌రి న‌య‌న‌తార ఏ పాత్ర చేసినా బాగా సూట్ అవుతుంద‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. అయితే ఈ సినిమా చేయ‌డం లేద‌ని ఆమె క్లారిటీ ఇచ్చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here