మ‌హేష్ బాబు సినిమా మ‌ళ్లీ వాయిదా..

2020 సంవ‌త్స‌రం ఆరంభంలో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో మంచి హిట్ అందుకున్నారు మ‌హేష్ బాబు. ఆ త‌ర్వాత క‌రోనా వ‌చ్చి సినిమాలు మొత్తం ఆగిపోయిన విష‌యం తెలిసిందే. అయితే స‌ర్కారు వారి పాట సినిమాతో మ‌ళ్లీ అల‌రించేందుకు మహేష్ సిద్ద‌మవుతున్నారు.

స‌ర్కారువారి పాట సినిమా షూటింగ్‌కు ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. సినిమా షెడ్యూల్ ప్ర‌కారం అమెరికాలో చిత్రీక‌ర‌ణ చేయాల్సి ఉంది. అయితే వీసాల స‌మ‌స్య కార‌ణంగా మొద‌ట హైద‌రాబాద్‌లోనే కొంత షూటింగ్ పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఆ త‌ర్వాత అమెరికాలో మిగ‌తా సినిమా షూట్ చేస్తే కంప్లీట్ అవుతుంద‌ని ప్లాన్ చేశారు. కానీ దీనికి కూడా అడ్డంకులు వ‌చ్చాయి. ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్‌తో పాటు కొత్త స్ట్రెయిన్ క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో మ‌రోసారి సినిమా వాయిదా వేయాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు ఆగిన త‌ర్వాత సినిమా షూట్ చేద్దామ‌న్న ఆలోచ‌న‌లో మ‌హేష్ ఉన్నారంట‌. ఫిబ్ర‌వ‌రి నెల నుంచి షూటింగ్ ప్రారంభించాల‌ని అనుకుంటున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అఫిషియ‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here