ప‌వ‌న్‌, రానా సినిమా టైటిల్ లీక్‌..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, హీరో రానా ఇద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవ‌లె స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాపై ఎప్ప‌టికీ భారీ అంచ‌నాలే ఉంటాయి. అయితే పవ‌ర్ స్టార్‌తో మ‌రో స్టార్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై ప్ర‌త్యేక‌మైన అంచ‌నాలు ఇండ‌స్ట్రీలో ఉన్నాయి.

మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియం` రీమేక్‌లో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా టైటిల్‌పైనే ఇప్పుడు అంద‌రూ ఆలోచిస్తున్నారు. అప్ప‌ట్లో చిరంజీవి, మోహ‌న్ బాబు క‌లిసి నటించిన సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఇదే టైటిల్‌ను పెడితే బాగుంటుంద‌ని చిత్ర యూనిట్ అనుకుంటుంద‌ని స‌మాచారం. టైటిల్‌పై ప‌వ‌ర్ స్టార్ కూడా సానుకూలంగానే ఉన్నార‌ని టాక్‌. మ‌రి ఈ టైటిల్‌నే ఫిక్స్ చేస్తార‌ని అనుకుంటున్నారు. మ‌రికొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ రెగ్యుల‌ర్‌గా ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here