మోదీపై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

దేశంలో రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ వారు ఆందోళ‌న‌లు చేస్తూనే ఉన్నారు. అయితే దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపినా ఫ‌లితం మాత్రం లేదు. కాగా రోజురోజుకీ రైతుల‌కు దేశ వ్యాప్తంగా మ‌ద్ద‌తు పెరుగుతోంది.

రైతుల మరణాలకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టా లకు వ్యతిరేకంగా ఢిల్లీలో 24 రోజులుగా రైతులు ఆందోళనలు చేపట్టగా, అందులో పాల్గొన్న 36 మంది రైతులు మృతిచెందారు. మృతిచెందిన రైతులకు నివాళులర్పించే కార్యక్రమం రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఏవీ సుబ్రమణియన్‌ అధ్యక్షతన పుదుచ్చేరిలోని ప్రధాన తపాలా కార్యాలయం సమీపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నారాయణస్వామి మృతిచెందిన రైతుల చిత్రపటాల ముందు కొవ్వొత్తులు వెలిగించి, పూలు చల్లి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆందోళన చేపట్టిన రైతులతో చర్చలు జరపని ప్రధాని మోదీ, పెట్టుబడి దారులు, కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధులతో సమావేశమై కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతివ్వాలని కోరడం ఎంతవరకు న్యాయ మని ప్రశ్నించారు. రైతుల ఆందోళనతో వ్యవసాయ రంగానికి రూ.36 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, ఆందోళన చేపట్టిన రైతుల మృతికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. దేశవ్యాప్తంగా 70 శాతం మంది రైతులు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ మహా ఉద్యమం చేపట్టారని, ఇందులో మృతిచెందిన రైతులకు నివాళులర్పించేలా కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నారాయణస్వామి డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here