ఇండ‌స్ట్రీలో సాయి ప‌ల్ల‌వి ఏం చేస్తుందో తెలుసా..

సాయిప‌ల్ల‌వి గురించి అంద‌రూ ఇప్పుడు చ‌ర్చించుకుంటున్నారు. డ్యాన్స్ షో ద్వారా ప్ర‌పంచానికి ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీని ఆక‌ట్టుకుంటోంది. వ‌రుస సినిమాల‌తో బిజీ హీరోయిన్ అయిపోయింది ఈ బ్యూటీ.

రెగ్యులర్ కమర్షియల్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ సాయిప‌ల్ల‌వి దూసుకుపోతోంది. ఇప్ప‌టికే నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ల‌వ్‌స్టోరీ సినిమా చేసింది. ఈ సినిమాను శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ట్ చేసిన విష‌యం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. నితో `శ్యామ్ సింగరాయ్` సినిమా చేయబోతోంది. అలాగే తాజాగా ప్రారంభమైన పవన్ కల్యాణ్-రానా సినిమాలో కూడా సాయిపల్లవి కీలక పాత్రకు ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇక, గోపీచంద్ హీరోగా రాబోతున్న `అలిమేలుమంగ వేంకటరమణ` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా సాయిపల్లవినే తీసుకున్నారట. ఇలా వరుసగా క్రేజీ సినిమాలతో సాయిపల్లవి సత్తా చాటుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here