కీర్తి సురేష్ ఎందుకు లావు అవుతుందో..

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌తో దూసుకుపోతున్న హీరోయిన్ల‌లో కీర్తి సురేష్ కూడా ఉన్నారు. మ‌హాన‌టి సినిమాతో త‌న‌లోని న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు కీర్తి. ఆ సినిమా త‌ర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీయాలంటే ఆమెను కూడా గుర్తుచేసుకుంటున్నారు. అప్ప‌ట్లో న‌య‌న‌తార‌, అనుష్క హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీసి శ‌భాష్ అనిపించుకుంటున్నారు.

ఇప్పుడు కీర్తి సురేష్ అన్ని ర‌కాలా సినిమాలు తీస్తున్నారు. మొన్న మిస్ ఇండియా సినిమాతో మ‌రోసారి ఆమె ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే సినిమాకు సినిమాకు మ‌ధ్య‌లో కీర్తి సురేష్ అందంలో చాలా మార్పులు వ‌స్తున్నాయి. ఓ సినిమాలో బొద్దుగా మ‌రో సినిమాలో మ‌రో విధంగా ఆమె క‌నిపిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ మళ్లీ లావు అవుతున్నారు. మహేష్ హీరోగా డైరెక్టర్ పరశురామ్ రూపొందిస్తున్న `సర్కారు వారి పాట`లో కీర్తి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి మునపటి రూపంలోనే కాస్త బొద్దుగా కనిపించబోతోందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here