కొత్త వైరస్ గురించి షాకింగ్ న్యూస్‌..

క‌రోనా వైర‌స్ ఎంత భ‌యంక‌రంగా విజృంభించిందో మ‌న‌కు తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిన స్ట్రెయిన్ కరోనా వైరస్ కూడా అంతే భ‌యంక‌రంగా వ‌స్తుంద‌ని అంటున్నారు. క‌రోనా వైర‌స్ కంటే ఇది ఎక్కువ‌గా ప్ర‌భావం చూపుతుంద‌ని చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప‌లు విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

యూకేలో మొద‌లైన ఈ వైర‌స్‌పై ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉన్నాయి. ఇప్ప‌టికే ఆ దేశానికి సంబంధించిన విమాన రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఇక వైర‌స్ విష‌యానికి వ‌స్తే.. క‌రోనా వైర‌స్ సోక‌కుండా అంద‌రూ అతి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అయితే క‌రోనా వైర‌స్ పిల్ల‌ల‌కు త‌క్కువ‌గా హాని చేస్తుంద‌ని మ‌న‌కు తెలిసిందే. అయితే ఇప్పుడు వ‌స్తున్న స్ట్రెయిన్ కరోనా వైరస్ మాత్రం వ‌య‌స్సుతో తేడా లేకుండా అంద‌రిపై ప్ర‌భావం చూపుతుంద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించిన విష‌యాల‌ను శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. పిల్లలకు స్ట్రెయిన్ వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దక్షిణ బ్రిటన్‌లో స్ట్రెయిన్ తీవ్ర రూపం దాల్చిందని, దేశవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పారు.

కరోనా వైరస్ ఎక్కువగా పెద్దలపై మాత్రమే ప్రభావం చూపిందని, అయితే.. ఈ కొత్త వైరస్ స్ట్రెయిన్ మార్పు చెందే అవకాశం ఉందని, ఆ మార్పుల వల్ల చిన్నారులకు ఇన్‌ఫెక్షన్‌ హాని ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మనిషి శరీర కణాల్లోకి ప్రవేశించగానే స్ట్రెయిన్ వైరస్‌కు సంబంధించిన మార్పులు మొదలవుతాయని, అందువల్ల చిన్నారులతో పాటు పెద్ద వయసు వారిలో కూడా రోగ నిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here