అల్లు అర్జున్ సినిమాలో తమిళ హీరో..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా వ‌స్తుందంటే చాలు ఫ్యాన్స్ ప్ర‌త్యేక‌మైన అభిమానం చూపిస్తారు. బ‌న్నీ డ్యాన్సులు, ఫైట్లు అభిమానుల‌కు బాగా ఆక‌ట్టుకుంటాయి. అల్లు అర్జున్‌కు అన్ని వ‌య‌స్సుల వారు అభిమానులే అని చెప్పొచ్చు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన అలా వైకుంఠ‌పురంలో సినిమా మంచి స‌క్సెస్ అందుకుంది.

తాజాగా ఆయ‌న స్టార్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు పుష్ప అని పేరు కూడా పెట్టేశారు. స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ‌డ్రైవర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో త‌మిళ్ హీరో ఆర్య న‌టిస్తున్నార‌ని అంటున్నారు. ఆర్య విల‌న్ రోల్ చేయ‌నున్నాడ‌ని టాక్‌. ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావ‌రి జిల్లా అట‌వీ ప్రాంతంలో ప్రారంభ‌మైనా లాక్ డౌన్ వ‌ల్ల ఆగిపోయింది. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆర్య‌ను విల‌న్‌గా ఫిక్స్ చేశార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. దీనికి సంబంధించిన అఫిషియ‌ల్ స‌మాచారం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here