బిగ్‌బాస్‌4 విన్న‌ర్ అభిజీత్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఎందుకు క‌లిశారు..

తెలుగులో బిగ్‌బాస్ షో ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె బిగ్‌బాస్ 4వ సీజ‌న్ కూడా పూర్త‌య్యింది. ఉత్కంఠ‌గా సాగిన ఈ సీజ‌న్‌లో అభిజీత్ విన్న‌ర్ అయిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్ నుంచి విజేత‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అభిజీత్ ప‌లువురు ప్ర‌ముఖుల‌ను క‌లుసుకుంటున్నారు.

ఇటీవ‌ల మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబును కూడా అభిజీత్ క‌లిశారు. తాజాగా ఇప్పుడు హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను క‌లిశాడు. విజ‌య్‌, అభిజీత్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. అభి హీరోగా నటించిన `లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్` సినిమాలో విజయ్‌ దేవరకొండ ఒక చిన్న నెగెటివ్‌ పాత్రలో నటించాడు. ఆ సమయంలోనే వీరు స్నేహితులుగా మారారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న అభికి విజయ్ సోషల్‌ మీడియా ద్వారా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌ను అభి కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫుల్ చిల్ అని కామెంట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here