3 రోసెస్ వెబ్ సిరీస్ రివ్యూ

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతీ ర‌చ‌న‌లో భాగం పంచుకోగా మ‌గ్గీ ద‌ర్శ‌క‌త్వం వహించారు . ముగ్గుర‌మ్మాయిల జీవిత‌క‌థ ఆధారంగా రూపొందించిన 3 రోసెస్ వెబ్ సిరీస్ ఓటీటీప్రియుల‌ను చాల బాగా ఆక‌ర్షిస్తోంది. యువ‌త‌ను ఆకర్షించేలా కొత్త కంటెంట్‌తో ఆహా వ‌స్తోంది. కొంచెం బోల్డ్ ,కామెడీ, సందేశాత్మ‌కంగా రూపొందించారు. నేడు విడుదల అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.

క‌థ: రీతూ (ఈషా రెబ్బా), జాహ్న‌వి (పాయ‌ల్ రాజ్‌పుత్‌), ఇందు (పూర్ణ‌) వేర్వేరు నేప‌థ్యం గ‌ల అమ్మాయిలు. వీరు త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డాల‌నే స్వ‌భావంతో ఉంటారు. వివాహ వ‌య‌సు దాటినా కూడా పెళ్లి కాదు. దీంతో సంబంధాలు చూస్తుంటారు. ఈ క్ర‌మంలో రీతుకు వైవ హ‌ర్షను చూడ‌గా అత‌డు న‌చ్చ‌కపోయినా త‌ల్లి బ‌ల‌వంతంతో అంగీక‌రిస్తుంది. ఇక జాహ్న‌వి బోల్డ్ అమ్మాయి. పార్టీలు, పబ్‌లంటూ విలాస‌వంత‌మైన జీవితం పొందుతుంటుంది. వివాహం కాకుండ‌నే అబ్బాయిల‌తో అన్నీ అనుభ‌వించేస్తోంంది. వ‌య‌సు మీద ప‌డుతున్నా పెళ్లి చేసుకోవ‌డానికి స‌రైన వ్య‌క్తి దొరక్క ఇందు బాధ‌ప‌డుతుంటుంది. ఈ ముగ్గురు ఒక‌చోట‌కు చేరి ఏం చేశారో అనేది మిగ‌తా క‌థ‌. ఒక‌రి నీడ‌లో బ‌త‌కాల్న అనే ప్ర‌శ్న‌తోనే మ‌న‌కు క‌థ అర్థ‌మ‌వుతుంది.

విశ్లేషణ : ప్రేమ‌… పెళ్లి.. మోహంలో తిక‌మ‌క‌ప‌డే అమ్మాయిల జీవితాల నేప‌థ్యంలో ఈ సిరీస్ ఉంది. రీతూ, జాహ్న‌వి, ఇందు పాత్ర‌ల‌తో ప్ర‌స్తుత స‌మాజంలో అమ్మాయిల మ‌న‌స్త‌త్వం ఎలా ఉందో ఈ సిరీస్ ద్వారా చూపించారు. స‌మాజంపై ద్వేష‌భావంతో ర‌గిలిపోయే పాత్ర‌లో ఈష‌, పాయ‌ల్‌, పూర్ణ క‌నిపించారు. రొమాంటిక్‌తో పాటు హాస్య‌ప్ర‌ధానంగా ఈ సిరీస్ రూపొందించారు. మ‌న ప‌రిస‌రాల్లో జ‌రుగుతున్న క‌థ‌నే వ‌స్తువుగా తీసుకోవ‌డంలో మారుతీ మార్క్ క‌నిపించింది. ర‌వి నంబూరి క‌థ‌ను ద‌ర్శ‌కుడు మ‌గ్గీ ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యాడు. నిర్మాణ‌ప‌రంగా ఉన్నంత‌గా ఉంది. క్వాలిటీలో ఆహా మార్క్‌ను ఎవ‌రూ అధిగ‌మించ‌లేరు.మారుతీ మార్క్ కనిపించేలా డైలగ్ లు అదిరిపోయాయి ,తెలుగు వెబ్ సిరీస్ వాల్యూ పెరిగేలా ఈ వెబ్ సిరీస్ అద్భుతంగా తెరకు ఎక్కించారు వెబ్ సిరీస్ ఐనా కూడా చాల రిచ్ గా తీశారు పంచ్ డైలగ్స్ తో అదిరిపోయే కామెడీ ని అందించారు .

తీర్పు: రీతూ పాత్ర‌లో ఈషా రెబ్బ అద‌ర‌గొట్టింది. ఇక జాహ్న‌విగా పాయ‌ల్ రాజ్‌పుత్ సెన్సార్ బోర్డుకు ప‌ని చెప్పేలా బోల్డ్ పాత్ర‌లో మెరిసింది. ఆమె అందాలు ప్రేక్ష‌కుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తాయి. షోస్‌తో బిజీగా ఉంటున్న పూర్ణ ఓటీటీలోకి దూసుకొచ్చింది. వ‌య‌సు మీద ప‌డినా పెళ్లి కాని అమ్మాయి పాత్ర‌లో సెట్ట‌య్యింది. హేమ‌, ప్రిన్స్ త‌మ ప‌రిధిల్లో న‌టించారు. ఓటీటీ ప్రియుల‌కు మ‌రో ఆస‌క్తిక‌ర క‌థాంశంతో ఆహా వెబ్ సిరీస్ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చింది. మీరు కూడా చూసి ఆనందించండి.

రేటింగ్- 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here