పోలవరం’పై పచ్చమీడియా కళ్ళమంట..!

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్టు ‘పోలవరం’. ఆయన బ్రతికి ఉన్నప్పుడే ‘పోలవరం’ ప్రాజెక్టు పనులకు బీజం పడింది. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ప్రాజెక్టు పనులు నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పట్టాలెక్కింది. కేంద్రం ‘పోలవరం’ను జాతీయ ప్రాజెక్టుకుగా ప్రకటించినప్పటికీ పెద్దగా నిధులు మంజూరు చేసిన పాపానా పోలేదు. ఇక ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడికి ‘పోలవరం’ ప్రాజెక్టును ఓ ఏటీఎం మిషన్ గా మాత్రమే కన్పించింది. ఐదేళ్లలో పోలవరంలో తట్టెడు అభివృద్ధి చేయని చంద్రబాబు ఇప్పుడు ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి నానా హంగామా చేస్తున్నారు.

– తీరుమార్చుకొని చంద్రబాబు..
ఏపీలోని అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి చేస్తానంటూ గొప్పలు చెప్పుకున్న బాబు నిజానికి చేసింది మాత్రం శూన్యమే. అమరావతి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు గ్రాఫిక్స్ ను పచ్చమీడియా ‘బాహుబలి’ రేంజులో చూపించింది. అయితే వాస్తవాలు తెలుసుకున్న ప్రజలు గత ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. అయినాగానీ చంద్రబాబు నాయుడికి.. ఆయన వంత పడుతున్న పచ్చమీడియాకు ఇంకా బుద్దిరాకపోవడం శోచనీయంగా మారింది.

– చంద్రబాబుకు బాకలూదడమే పచ్చమీడియా పని..
ఒకే అబద్దాన్ని పదేపదే చెప్పడం ద్వారా దానిని నిజం చేయాలని పచ్చమీడియా భావిస్తోంది. చంద్రబాబు నాయుడికి వత్తాసు పలుకుతూ ‘పోలవరం’లో అవినీతి జరిగిపోతుందంటూ నానా హైరానా చేస్తోంది. చంద్రబాబు నాయుడి గ్రాఫిక్స్ ను అహా.. ఓహో అని ‘బాహుబలి’ రేంజులో నాడు చూపించిన పచ్చమీడియా ఇప్పుడు మాత్రం నానా గగ్గోలు చేస్తోంది. పోలవరంలో సీఎం జగన్ సర్కార్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోంది. దొందు దొందే అన్నట్లుగా అవినీతికి పాల్పడే పచ్చమీడియా.. చంద్రబాబు నాయుడికి మంచి పని చేసినా బూతులాగా కన్పించడం విడ్డూరంగా మారింది.

– అవినీతికి తావులేకుండా పనులు..
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ‘పోలవరం’ ప్రాజెక్టును ఓ ఛాలెంజ్ తీసుకొని చేపడుతున్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి.. ఏపీ ప్రజల చిరకాలవాంఛ అయిన ‘పోలవరాన్ని’ తన హయాంలోనే పూర్తి చేసేలా సంకల్పించారు. ఇందుకోసం సీఎం జగన్ ఖర్చుకు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా వేలకోట్ల రూపాయాలను ఖర్చు చేస్తున్నారు. ఖజానాపై భారం పడుతున్నప్పటికీ కరోనా సమయంలోనూ ప్రాజెక్టు పనులను ఎక్కడా ఆపకుండా జెట్ స్పీడుతో పనులు చేస్తున్నారు. ప్రాజెక్టు సంబంధించిన అన్ని వ్యయాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడూ ఆడిట్ చేస్తూ నిస్పాక్షపతంగా..అవినీతికి తావులేకుండా పనులను చేస్తూ ముందుకు సాగుతోంది.

– కేంద్ర జలం సంఘం సూచనలతో మార్పులు చేర్పులు..
గత ప్రభుత్వం పోలవరంలో చేసిన తప్పులను సరిదిద్దూ జగన్ సర్కార్ ప్రాజెక్టులో కొన్ని మార్పులను చేర్పులను చేసింది. టీడీపీ హయాంలో పోలవరంలో కొన్నిచోట్ల ఇంజనీరింగ్ ప్రమాణాలకు విరుద్దంగా పనులు చేపట్టారు. దీంతో ఆ పనులు దెబ్బతిన్నాయి. నాటి తప్పులను దృష్టిలో ఉంచుకొని పోలవరంలో 50లక్షల క్యుసెక్కుల వదర వచ్చినా జలాశయం తట్టుకొని స్పిల్ వే మీదుగా వరద సులభంగా పారేందుకు నిర్మాణ పనుల్లో.. డిజైన్లలో కేంద్ర జలసంఘం మార్పులు సూచించింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వ్యయం పెరుగుతోంది.

– జ్యూడిషియల్ అప్రూవల్ తర్వాత టెండర్లు..
పోలవరం ప్రాజెక్ట్ లో అదనపు పనులను ఇటీవలే కేంద్ర జలసంఘం సూచన మేరకు ఏపీ సర్కార్ చేర్చింది. ఇందుకుకోసం 683 కోట్ల పనులకు జగన్ సర్కార్ ఇటీవల జ్యూడిషియల్ అప్రూవల్ తీసుకుని టెండర్లను పిలిచింది. ఇటీవల డిడిఆర్పీ సభ్యులు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి పనులు వేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రాజెక్టు భద్రతకోసం మరి కొన్ని కొత్త డిజైన్లు సూచించారు.. దీని ప్రకారం పాత అగ్రిమెంట్ కు అదనంగా కొత్త పనులు జత అవ్వడంతో ప్రాజెక్టు అంచనాలు మరింతగా పెరిగాయి. ఇవన్నీ కూడా సీడబ్ల్యూసీ సూచనల మేరకు అదనంగా చేర్చారు.

– స్పిల్ ఛానెల్ ఎండ్ కటాఫ్ డయా ఫ్రంవాల్..
స్పిల్ ఛానెల్ చివరన 12 మీటర్ల లోతు నుంచి 1354 మీటర్ల పొడవున కటాఫ్ వాల్ ను నిర్మించనున్నారు. స్పిల్ ఛానెల్లో నిర్మించే కాంక్రీట్ బ్లాకులు.. మట్టి స్పిల్ వే నుండి వచ్చే భారీ వరద ప్రవాహాని కొట్టుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది. ఒక వేళ స్పిల్ వే నుండి విడుదల చేసే భారీ వరద ప్రవాహా వేగానికి కాంక్రీట్ బ్లాకులు, మట్టి కొట్టుకుపోయినా ఈ డయా ఫ్రం వాల్ అడ్డుకుంటుంది. దీనిని 83.17కోట్లతో నిర్మించనున్నారు. కేంద్ర జల సంఘం సూచనల మేరకు ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పటిష్టత కోసం 211.12కోట్ల కొత్త టెండర్ ను కూడా పిలిచారు..

– గ్యాప్-1.. గ్యాప్-3 లలో డ్యాంల నిర్మాణం..
గతంలో ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ లో పోలవరం హెడ్ వర్క్స్ పనులను మేఘా ఇంజనీరింగ్ దక్కించుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా గ్యాప్-1లో కేవలం ఎర్త్ డ్యాం మాత్రమే నిర్మించేలా అగ్రిమెంట్ లో ఉంది. ఐతే కేంద్రజలసంఘం నిపుణుల సూచనలకు అనుగుణంగా 586 మీటర్ల పొడవున ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాంను నిర్మించాలని సూచించడం జరిగింది. దీని కోసం భూమిలోపల నుండి ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యాం నిర్మించడంతో పాటు.. స్టోన్ కాలమ్స్.. డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు కూడా చేయాల్సి ఉంది.

– ప్రాజెక్టు రక్షణ కోసం చేపడుతున్న పనులు..
ఈ పనులకు సైతం 242.87 కోట్లతో టెండర్ పిలవడం జరిగింది. ఇలా ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యాం, మరియు స్టోన్ కాలమ్స్, డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు చేయడం వల్ల నీరు ఎక్కడా కూడా లీక్ అవ్వకుండా అడ్డుకుంటుంది. ఇలా చేయడంతో పక్కనే ఏర్పాటు చేస్తున్న జల విద్యుత్ ప్రాజెక్ట్ కు కూడా రక్షణగా ఉంటుంది. గ్యాప్-3లో కూడా ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ లో కేవలం ఎర్త్ డ్యాం మాత్రమే నిర్మించాలని ఉంది. అయితే ప్రాజెక్ట్ భద్రత దృష్ట్యా ఎర్త్ డ్యాం బదులు 140 మీటర్ల పొడవున, స్పిల్ వే లెవల్ కు కాంక్రీట్ డ్యాం నిర్మించాలని సూచించడం జరిగింది. దీని కోసం 11.64 కోట్లతో టెండర్లు పిలిచారు. స్పిల్ వే కుడి,ఎడమ కొండలకు రక్షణ చర్యల కోసం 134.21కోట్లతో పనులకు టెండర్లను పిలిచారు.

– కేంద్రం జల సంఘం సూచనలతో పెరిగిన వ్యయం..
ప్రాజెక్టు రక్షణ చర్యలకు కేంద్ర జలసంఘం ఇటీవల అదనంగా కొన్ని పనులను సూచించింది. దీంతో ప్రాజెక్టు వ్యయం అదనంగా 683 కోట్ల రూపాయల వ్యయం పెరిగింది. వీటికోసం ఇటీవలే జ్యూడీషియల్ ప్రివ్యూ పూర్తి అయిన తరువాత టెండర్లు ఆహ్వానించారు. వీటితో పాటు మరికొన్ని అదనపు పనులు కూడా కేంద్ర జలసంఘం సూచించింది. గతంలో కాంట్రాక్ట్ సంస్థ చేసుకున్న అగ్రిమెంట్ వాల్యూకు కొత్తపనులు చేరడంతో ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగింది. ఈ పెరిగిన అంచనాలను కేంద్రజలసంఘం ఆమోదం పొందిన తరువాతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది.

ప్రాజెక్టు వ్యయం పెరగడాన్ని టీడీపీ సాకుగా చూపించి పచ్చమీడియాతో బురదజల్లే యత్నం చేస్తోంది. కాంట్రాక్టుకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యయం పెంచిందంటూ పచ్చమీడియాలో కొద్దిరోజులుగా ఊదరగొడుతోంది. అయితే ఎప్పటిలాగే పచ్చమీడియా నిజనిజాలు తెలుసుకోకుండా జగన్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తుండటాన్ని ప్రజలు సైతం చీదరించుకుంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకు బాకాలు ఊదే పచ్చమీడియాలు తమ వైఖరి మార్చుకోవాలని లేకపోతే వారికి పుట్టగతులు ఉండవని ఏపీ రైతులు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here