రాజమౌళి సినిమా అంటే అలాగే ఉంటుందా..

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి సినిమాలు ఓ రేంజ్‌లో ఉండిపోతాయి. ఆయ‌న తీసిని ప్ర‌తి ఒక్క సినిమా ఓ క్రెడిట్‌ను సొంతం చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఆయ‌న తీస్తున్న చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌. ఈ సినిమాలో కూడా రాజ‌మౌళి త‌న‌దైన మార్క్‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని తెలుస్తోంది.

ఆర్‌.ఆర్‌.ఆర్ మూవీ షూటింగ్ వేగంగా జ‌రుగుతోంది. రాం చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఇద్ద‌రూ త‌మ పాత్ర‌ల‌కు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ద‌మ‌య్యారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్లు అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. సినిమాలో ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ యాక్షన్‌ ఏపిసోడ్‌ గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఎనిమిది నిమిషాల పాటు సిల్వర్‌ స్క్రీన్‌పై హోరెత్తించే యాక్షన్‌ ఎపిసోడ్‌ను దాదాపు యాబై రోజుల పైగానే జక్కన్న అండ్‌ టీమ్‌ చిత్రీకరించారట. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్‌ అజయ్‌ దేవగణ్‌, ఆలియా భట్‌లతో పాటు హాలీవుడ్ స్టార్స్‌ ఒలివియా మోరిస్‌, అలిసన్‌ డూడి, రే స్టీవెన్‌ సన్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here