వాట్సాప్ మారిపోయింది.. చూశారా..

మ‌నంద‌రికీ అందుబాటులో ఉన్న వాట్సాప్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాట్సాప్ ఇప్పుడు కొత్త‌గా షాపింగ్ బటన్ తీసుకొచ్చింది. దీని ద్వారా సంస్థ అందించే వస్తువులు, సేవలకు సంబంధించిన వివరాలను ప్రజలు తేలికగా తెలుసుకునేందుకు ఈ ఫీచర్ దోహదపడుతుందని చెబుతున్నారు.

వాట్సాప్ ఇప్పటికే మెసేజ్, వాయిస్ ఓవర్ ఐపీ సర్వీస్ అందిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా బిజినెస్ అకౌంట్లకు షాపింగ్ బటన్‌ను జోడించింది. దీని ద్వారా కంపెనీలు, విక్రేతలు అందించే వస్తు, సేవల జాబితాను ఒకే క్లిక్ ద్వారా చూడవచ్చు. కొంతకాలంగా ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షిస్తోంది. నిన్నటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ పదిహేడున్నర కోట్ల మంది వినియోగదారులు బిజినెస్ అకౌంట్లకు సందేశాలు పంపిస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో వాయిస్ కాల్ బటన్ స్థానంలో కొత్తగా షాపింగ్ బటన్‌ను చేర్చారు. దీంతో వాయిస్ కాల్ బటన్ కోసం కస్టమర్లు కాల్ బటన్‌ను ఎంచుకొని, అందులో వాయిస్ లేదా వీడియో కాల్ ను ఎంపిక చేసుకోవాలి. ఖాతాదారులు సులువుగా కొనుగోళ్ళు జరిపేందుకు వీలుగా కొత్త షాపింగ్ బటన్‌ను జోడించినట్లు వాట్సాప్ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here