పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్

టెక్నాలజీ రంగంలో అద్భుతాలు ఆవిష్కరిస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన పనిచేసినా అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని ఒడిసిపట్టుకుంటోంది. తన పనుల్లో కొత్త కొత్త సాంకేతికాలను ఆవిష్కరిస్తూ ముందుకువెళుతోంది. కొత్త కొత్త టెక్నాలజీని ఒడిసిపట్టుకొని వాటిని మరింత అభివృద్ధి చేస్తూ సాంకేతిక రంగంలో కొత్త ఒరవడి సృష్టిస్తోంది
ఇంటింటికి సిలిండర్ల ద్వారా గ్యాస్ ను పంపిణీ చేసే రోజులు ఇక పోనున్నాయి. ఇక నుంచి విదేశాల్లో వలే పైపుల ద్వారా నేరుగా గ్యాస్ సరఫరా చేసేందుకు నడుం బిగింది ఎంఈఐఎల్. నేరుగా పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్ ను సరఫరా చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి నేరుగా గ్యాస్ ను సరఫరా చేయడంతో పాటు వాహన అవసరాలకు ఇంధనాన్ని అందిస్తోంది. ఈ టెక్నాలజీతో సమయం ఆదాతో పాటు వినియోగదారులకు సులభంగా, సురక్షితంగా గ్యాస్ ను అందిస్తోంది. ఒక వైపు ఆకాశాన్నంటిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. మరో వైపు పరుగులు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో పేద, మధ్యతరగతి గృహ వినియోగదారులు భారం మోయలేకపోతున్నారు. ఆ భారాన్ని తగ్గించి వారికి ఊరటనివ్వడానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ కృషి చేస్తోంది.

ఈ క్రమంలోనే శరవేగంగా సీజీడీ, సీఎన్జీ గ్యాస్ స్టేషన్లను నిర్మించి మధ్యతరగతి ప్రజలకు భారం తగ్గిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ ధరలతో పోలిస్తే 40 శాతం తక్కువ రేటుకు మేఘా (ఎంఈఐఎల్) గ్యాస్ ను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఇప్పటికే గ్యాస్ ను సరఫరా చేస్తున్న ఎంఈఐఎల్ ఇప్పుడు తెలంగాణాలో తన సేవలను విస్తరిస్తోంది. నల్గొండ జిల్లాలో సేవలను ఇటీవలనే ప్రారంభించడం విశేషం.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి వాణిజ్య పరంగా వంటగ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశ్యం తో తీసుకువచ్చిన సీజీడీ (City Gas Distribution) ప్రాజెక్ట్ లో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ప్రాంతాల్లో పనులను పూర్తి చేసి చౌకధరలకు గ్యాస్ సరఫరా చేస్తోంది. రూ.5000 కోట్లతో ఈ మూడు రాష్ట్రాలలో కలిపి మొత్తం 11 లక్షల గృహాలకు గ్యాస్ సరఫరా కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సిజిడి వ్యవస్థ ద్వారా దాదాపు 4 వేల మంది ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు.

నల్గొండ జిల్లాలో తొలిసారిగా గ్యాస్ పైప్ లైన్, సిటీ గేట్ స్టేషన్, పనులను గడువులోగా పూర్తి చేసి నల్గొండ ప్రజలకు ‘మేఘా గ్యాస్’ కింద చౌక ధరలకు గ్యాస్ సరఫరా చేస్తోంది. సీజీడీ – నల్గొండ ప్రాజెక్ట్ లో భాగంగా నల్గొండ జిల్లాలోని వెలిగొండ మండలం, సుంకిషాల గ్రామంలో సహజవాయువు సరఫరా లో కీలకమైన సిటీ గేట్ స్టేషన్ (CGS), మదర్ స్టేషన్ ను ప్రారంభించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సరఫరా సేవలను మేఘా సంస్థ అందిస్తోంది.

వ్యయ ప్రయాసాలు తగ్గించి సులభంగా ఇంటింటికి గ్యాస్ అందే విధంగా ‘మేఘా గ్యాస్’ పటిష్టమైన ప్రణాళికతో మౌళిక వసతులు కల్పిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలో సరఫరా చేస్తున్నట్టు మేఘా గ్యాస్ బిజినెస్ హెడ్ పలింపాటి వెంకటేశ్ తెలిపారు. ప్రజల అవసరాల దృష్ట్యా గ్యాస్ సిటీ గేట్ స్టేషన్ ద్వారా పీఎన్జీ ( piped natural gas) గృహ, పారిశ్రామిక అవసరాలకు, అలాగే మదర్ స్టేషన్ ద్వారా సీఎన్జీ (compressed Natural Gas)ని వాహన అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావడం ఎంతో గర్వకారణమన్నారు. దీంతోపాటు నల్గొండ జిల్లాలో మరో 10 స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు.
40,000 కుటుంబాలకు & పరిశ్రమలకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశ్యం తో పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నారు.. సిజిడి ప్రాజెక్ట్ లో భాగంగా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేయడానికి ఉమ్మడి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్ లైన్ నిర్మాణంతో పాటు 20 సిఎన్జీ స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు.

ఎంఈఐఎల్ ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, కర్నాటకలోని తూంకూరు – బెల్గాం జిల్లాలలో గ్యాస్ సరఫరాను ఇప్పటికే ప్రారంభించింది. కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో సిటి గ్యేట్ స్టేషన్ ద్వారా, అలాగే తూంకూరు – బెల్గాం జిల్లాల్లోనూ గ్యాస్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ – వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్ సరఫరా చేయటం ద్వారా ఏకో ఫ్రెండ్లీ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు అవసరమైన గ్యాస్ ను ఓఎన్జీసీ – గెయిల్ నుంచి పొందనుంది.

మేఘా గ్యాస్ ‘ఇట్స్ స్మార్ట్ – ఇట్స్ గుడ్’ అనే ట్యాగ్ లైన్ తో తన సేవలను విస్తరిస్తోంది. మేఘా గ్యాస్ గృహాలు – వాణిజ్య సంస్థలు – పారిశ్రామిక సంస్థలతో పాటు రవాణా వాహనాలకు సహజ వాయువును సరసమైన ధరకు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన మదర్ స్టేషన్ నుంచి గ్యాస్ ను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు స్టీల్ – ఎండిపీఈ పైప్లను 722 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here