రకుల్ వేసిన ఈ ఆసనంతో లాభాలేంటో తెలుసా.?

కేవలం నటనకే కాకుండా ఫిట్నెస్ కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు యోగాలు, వర్కవుట్లు అంటూ జిమ్ ల బాట పడుతుందీ చిన్నది. రకుల్ కు ఫిట్నెస్ పైనున్న మక్కువతోనే ఎఫ్ 45 పేరుతో హైదరాబాదులో జిమ్ కూడా ఏర్పాటు చేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్ తన ఫిట్నెస్ కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘కపోతాసనం’ అనే ఆసనాన్ని వేసిన సమయంలో తీసిన ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘మూవ్‌, స్ట్రెచ్‌, స్ట్రెంగ్తెన్‌, సింపుల్‌ గో’ అనే క్యాప్షన్ ను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకోవడానికి నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు. ఇంతకీ ఈ కపోతాసనంతో కలిగే ప్రయోజనాలు ఏంటంటే.. గజ్జల్లోని కండరాలు, తొడలు, పొత్తికడుపులోని కండరాలతో పాటు వీపు భాగంలోని కండరాలు బలపడతాయట. మరి రకుల్ పరిచయం చేసిన ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేస్తారా.?

View this post on Instagram

Move , stretch , strengthen and simply let go ❤️

A post shared by Rakul Singh (@rakulpreet) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here