వై.ఎస్ జ‌గ‌న్ ఏమీ చేయ‌లేదు.. అంతా మేమే చేశాం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాదిన్న‌ర అయ్యింది. ఈ కాలంలో ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు వైసీపీ ప్ర‌భుత్వం చేస్తోంది. అయితే టిడిపి నేత‌లు మాత్రం ఇంత వ‌ర‌కు రాష్ట్రంలో జ‌గ‌న్ ఎలాంటి అభివృద్ధి చెయ్య‌లేద‌ని.. అభివృద్ది మొత్తం తెలుగుదేశం హ‌యాంలోనే జ‌రిగింద‌ని చెబుతున్నారు.

విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గ ఫ్లై ఓవ‌ర్ శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 2014 నుంచి 2019 వ‌ర‌కు ఏపీకి స్వ‌ర్ణ‌యుగంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఎన్నో ప్రాజెక్టులు ఏపీకి వ‌చ్చాయ‌న్నారు. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ త‌న అభ్య‌ర్థ‌న మేర‌కు రూ. 6వేల కోట్లు మంజూరు చేశార‌న్నారు. ఇక విజ‌య‌వాడ విమానాశ్ర‌యాన్ని త‌మ ప్రభుత్వం అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకువ‌చ్చింద‌న్నారు.

ఇక ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చాక ఒక్క ప్రాజెక్టు కూడా చేప‌ట్ట‌లేద‌న్నారు. విజ‌య‌వాడ‌, అమ‌రావ‌తి ప‌ట్ల జ‌గ‌న్ ధ్వేషిం చూపిస్తున్న‌ట్లు చెప్పారు. జ‌గ‌న్‌కు విజ‌య‌వాడ‌, అమ‌రావతి అంటే ఇష్టం లేద‌న్నారు. ప్రారంభోత్స‌వం సంద‌ర్బంగా వెంక‌య్యనాయుడు, చంద్ర‌బాబు నాయుడుకు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఏపీలో వైఎస్ జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ అన్నింటిలో మార్పు తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. నాడు నేడు అంటూ ఆయ‌న మార్పులు చేస్తున్నారు. కానీ టిడిపి మాత్రంఇలా విమ‌ర్శ‌లు చేస్తోంది. ఏదిఏమైనా విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు మాత్రం ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రావ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here