రవితేజా కోసం ‘అప్సర’ను దించారు.!

అప్సరా రాణి.. లాక్‌ డౌన్‌కు ముందు ఈ పేరు అసలు ఎవరికీ తెలియదు. ఇండస్ట్రీకి కొత్త కొత్త హీరోయిన్లను పరిచయం చేసే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అప్సరా రాణిని ‘థ్రిల్లర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఒరిస్సాకు చెందిన ఈ ముద్దుగుమ్మ తన హాట్‌ హాట్‌ ఫొటోలతో కుర్రకారును మతిపొగోట్టింది. ఒక్క సినిమాతోనే ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్న ఈ చిన్నది తాజాగా ఒక బంపరాఫర్‌ కొట్టేసింది.

గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న క్రాక్‌ సినిమాలో అప్సర ఐటెమ్‌ సాంగ్‌లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నట్లు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. అప్సరాతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘మాస్‌ ఐటెమ్ సాంగ్‌ లోడింగ్‌’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. ఈ పాటలో అందాల తార అప్సరా రాణి రవితేజతో కలిసి స్పెప్పులేస్తోంది. జానీ మాస్టర్‌ ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here