కరోనా పాఠాలు చెబుతోన్న మిల్కీ బ్యూటీ..!

కరోనా మహమ్మారి విజృంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్‌‌ వచ్చే వరకూ ఈ వైరస్‌కు అడ్డుకట్టపడేట్లు లేదు. అయితే చాలా మంది కరోనా బారిన పడిన కొన్ని రోజుల్లోనే కోలుకుంటుండడం సంతోషించాల్సిన విషయం. కానీ కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈక్రమంలోనే అందాల తార తమన్నా కూడా కరోనా జాగ్రత్తలు చెప్పుకొచ్చింది.

తమన్నా ఇటీవల కరోనాను జయించిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తమన్నా ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. ఇక ఇప్పుడిప్పుడే తిరిగి వర్కవుట్లు మొదలు పెట్టిన తమన్నా వర్కవుట్లకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ కొన్ని టిప్స్‌ అందించింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఫిట్నెస్‌ సంతరించుకోవడం చాలా ముఖ్యమని, వ్యాయామం చేయాలని తెలిపింది. అయితే వర్కవుట్లు హడావుడిగా కాకుండా శరీరం చెప్పేది వింటూ జాగ్రత్తగా చేయాలని సూచించారు. ఇక వీడియోలో తమన్నాను చూస్తే కరోనాకు ముందు తర్వాత తన ఫిట్నెస్‌లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here