నాకు.. నా పాత్రలకు చాలా తేడా ఉంటుంది.!

బాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్లలో నటి మల్లికా శెరావత్‌ ఒకరు. తన అందం, నటనతో ఆకట్టుకునే ఈ చిన్నది సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. ఇటీవల హథ్రాస్‌లో జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ ఈ నటి చేసిన ట్వీట్‌కు ఓ అభిమాని స్పందిస్తూ.. ‘మీ సినిమాల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి’ చేసిన కామెంట్‌కు మల్లికా తీవ్రంగా స్పందించింది. ఇబ్బంది ఉంటే నా సినిమాలు చూడొద్దని గట్టిగా స్పందించిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయమై మాట్లాడిన మల్లికా.. ‘సమాజంలో ఎక్కడ అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నా అమ్మాయిల డ్రెస్సింగ్‌, సినిమాలను తప్పుబడుతూ మాట్లాడుతారు. ముందు ఆ ఆలోచనా విధానం మారాలి. సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న దారుణాలకు అడ్డుకట్ట వేయాలంటే న్యాయపరమైన మార్పులు తీసుకురావడమే కాదు. మనిషి ఆలోచనా విధానంలో ఎన్నో మార్పులు రావాలనేది నా ఉద్దేశం. వెండితెరపై నేను పోషించే పాత్రలకు నా నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ రెండింటికీ ఎంతో వ్యత్యాసం ఉంది. సినిమాల విషయంలో నేను కచ్చితమైన సరిహద్దు పెట్టుకున్నాను. మొదటి నుంచి దానిని దాటలేదు’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here