సీఎం వై.ఎస్ జ‌గ‌న్‌ను ఇలా టార్గెట్ చేశారేంటి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు ఆసక్తిక‌రంగా ఉన్నాయి. అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారాస్థాయికి చేరింది. టార్గెట్ వై.ఎస్ జ‌గన్ అన్న‌ట్లు ప్ర‌తిప‌క్షం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని తెలుస్తోంది. అందుకే సీఎం జ‌గ‌న్ జైలుకెళ‌తారంటూ చేస్తున్న కామెంట్లు మితిమీరిపోతున్నాయి.

ఏపీలో ఇటీవ‌ల వైఎస్ న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై పోరాడుతున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో ఏం జ‌రుగుతుందో ఆయ‌న క్లియ‌ర్‌గా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి లేఖ రాశార‌ని వైసీపీ చెబుతోంది. ఈ వివ‌రాల‌ను మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేశారు. అప్ప‌టి నుంచి రాజ‌కీయ‌లు ట‌ర్న్ తీసుకున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర విష‌యాల‌పై మాట‌ల దాడులు చేసుకున్న పార్టీలు.. ఇప్పుడు కేవ‌లం న్యాయ వ్య‌వ‌స్థ అనే అంశంపైనే తిరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ రాసిన లేఖ‌పై తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ వై.ఎస్ జ‌గ‌న్‌కు శిక్ష ప‌డుతుంద‌ని చెప్పారు. ఢిల్లీ సంస్థ అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్ ఇటీవ‌ల ఓ నివేదిక విడుదల చేసింద‌ని.. దీనిలో ఉన్న వివ‌రాల ప్ర‌కారం జ‌గ‌న్‌కు 10 నుంచి 30 ఏళ్ల వ‌ర‌కు జ‌గ‌న్‌కు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు. గుంటూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో జ‌రిగిన స‌మ‌న్వ‌య స‌మావేశంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇక అదే పార్టీ నేత య‌న‌మల రామ‌కృష్ణుడు సైతం జ‌గ‌న్ సీఎం కుర్చీ గురించే మాట్లాడుతున్నారు. జ‌గ‌న్ త‌ర్వాత సీఎం ఎవ‌ర‌నే చ‌ర్చ వైకాపా శిబిరంలో జోరుగా సాగుతోంద‌ని ఆయ‌న అన్నారు. జ‌గ‌న్ ఇప్పుడున్న కేసుల‌కు అధ‌నంగా కోర్టు దిక్క‌ర‌ణ కేసు కూడా కొనితెచ్చుకున్నార‌న్నారు. ఇవ‌న్నీ చూస్తుంటే కేవ‌లం జ‌గ‌న్ ను మాత్ర‌మే ప్ర‌తిప‌క్ష పార్టీ టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here