ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదుల ర‌హ‌స్య స్థావ‌రంలో భారీగా ఆయుధాలు స్వాధీనం..

ఉగ్ర‌వాదుల భారీ స్థావ‌రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జ‌మ్ముకశ్మీర్‌లో భారీగా ఆయుదాలు, సామాగ్రిని సైన్యం, పోలీసులు క‌నిపెట్టారు. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం దాడులు చేసి దీన్ని స్వాధీనం చేసుకున్నారు.

జమ్మూకశ్మీరులో లష్కరే తోయిబా ఉగ్రవాదుల రహస్య ఆయుధగారం గుట్టును జమ్మూకశ్మీర్ పోలీసులు రట్టు చేశారు. పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జేహలూం నదీ తీరానికి సమీపంలోని కావానీ గ్రామం వద్ద లష్కరేతోయిబా ఉగ్రవాదులు రహస్యంగా ఆయుధగారం ఏర్పరచుకున్నారు. లష్కరే తోయిబా ఆయుధగారం గురించి సమాచారం అందిన జమ్మూకశ్మీర్ పోలీసులు 55 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్సు జవాన్లతో కలిసి గాలించారు.

ఈ గాలింపులో లష్కరే తోయిబా ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాలు దాచిన గది వెలుగుచూసింది. ఈ రహస్య గదిలో ఐరన్ రాడ్లు, మందుగుండు సామాగ్రి, తుపాకులు, పిస్టళ్లు, ఏకే 47 తుపాకులు, మూడు గ్రెనెడ్లు లభించాయి. ఈ ఆయుధగారాన్ని పోలీసులు పేల్చివేశారు. ఇటీవ‌ల ఆయుదాలు స‌ర‌ఫ‌రా చేసేందుకు ప్ర‌య‌త్నించిన ఘ‌ట‌న‌ను పోలీసులు అడ్డుకున్నారు. పైపుల ద్వారా ఆయుధాలు భార‌త్‌లోకి పంపేందుకు కొంద‌రు కుట్ర ప‌న్నారు. దీన్ని గ‌మ‌నించిన సైన్యం అడ్డుకుంది. ఇది జ‌రిగిన వారం వ్య‌వ‌ధిలోపే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. దీన్ని గ‌మ‌నిస్తే ల‌ష్క‌రే తోయిబా ఇండియాపై ఏమేర‌కు ప‌నిచేస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here