నన్ను కలర్‌ తక్కువ అని కామెంట్ చేశారు..

షార్ట్ ఫిలింలో ద్వారా కెరీర్ మొదలు పెట్టింది నటి చాందినీ చౌదరి. తనదైన క్యూట్ నటనతో దర్శక నిర్మాతలను ఆకర్షించిన ఈ తెలుగమ్మాయి సినిమాల్లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన చాందిని ‘కేటుగాడు’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఇక ‘హౌరా బ్రిడ్జ్’, ‘మను’ చిత్రాల్లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘కలర్ ఫోటో’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 23న ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చాందిని పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఈ సందర్భంగా చాందిని మాట్లాడుతూ..  ‘హీరోయిన్‌గా నా ప్రయాణం ప్రారంభించేటప్పుడు అందరికీ నచ్చేలా సినిమా చేశాను. కానీ ఇప్పుడు నా మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నాను. ఇక కలర్ ఫోటో సినిమా విషయానికొస్తే.. వర్ణవివక్ష నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఇప్పటికీ మన సమాజంలో వర్ణ వివక్ష ఉంది. సినిమా ఇండస్ట్రీలో నన్ను ఒకరు.. ‘నువ్వేమైనా పెద్ద రంగనుకుంటున్నావా.?’ అని అడిగారు. నేను కలర్ తక్కువ అని  కామెంట్ చేశారు. రంగును బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని, స్థాయిని  అంచనా వేయడం సరికాదు’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here