ఏప్రిల్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ రిలీజ్‌..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింద‌న్న ప్ర‌చారం ఎక్కువ‌గా సాగుతోంది. ప‌వన్ తాజాగా న‌టించిన చిత్రం వ‌కీల్ సాబ్‌.. సినిమా షూటింగ్ ఇటీవ‌ల ప‌లు ప్రాంతాల్లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సినిమా డేట్ రిలీజ్ అయ్యిందంటున్నారు.

వ‌కీల్ సాబ్ సినిమా ఈ సంవ‌త్స‌ర‌మే విడుద‌ల కావాల్సి ఉంది. అయితే క‌రోనా కార‌ణంగా సినిమా రిలీజ్ వ‌చ్చే సంవ‌త్స‌రానికి వాయిదా ప‌డింది. బుధవారమే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగు పెట్టింది. తాజా సమాచారం ప్రకారం `వకీల్ సాబ్` సినిమాను వేసవి సందర్భంగా ఏప్రిల్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. సంక్రాంతికి `వకీల్ సాబ్` టీజర్‌ను విడుదల చేస్తారట. ఆ టీజర్‌తో పాటే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారట. ఈ సినిమాకు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజ్ నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here