హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి హాట్ టాపిక్‌..

ఇండ‌స్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ఓ వార్త ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది. కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతున్నార‌న్న వార్త ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతోంది. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేద‌ని తెలుస్తోంది.

కీర్తి సురేష్‌కు పెళ్లి చేయాల‌ని ఆమె త‌ల్లితండ్రులు అనుకుంటున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం కీర్తి సురేష్ వ‌య‌స్సు 28 సంవ‌త్స‌రాలు. దీంతో ఆమె పెళ్లి ప్ర‌స్తావ‌న ఇంట్లో వ‌చ్చింద‌ట‌. దీంతో పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేశారట. అయితే కీర్తి మాత్రం ఇప్పట్లో పెళ్లి వద్దని చెప్పేసిందట. ప్రస్తుతం అవకాశాలు భారీగా వస్తున్నాయి కాబట్టి కెరీర్‌పైనే దృష్టి పెట్టాలని ఫిక్స్ అయిందట. లాక్‌డౌన్ సమయంలో చాలా మంది సినీ ప్రముఖులు వివాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే. మ‌హాన‌టి`తో జాతీయ స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించింది హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం నితిన్‌తో పాటు మ‌హేష్ బాబు తో క‌లిసి ఆమె న‌టించ‌బోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here