భ‌ర్త‌కు మ‌రో మ‌హిళ‌తో పెళ్లి చేయ‌నున్న‌ భార్య‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

అచ్చం సినిమాలో జ‌రిగిన‌ట్లే జ‌రుగుతోంది. త‌న భ‌ర్త వేరే మ‌హిళ‌ను ఇష్ట‌పడుతున్నాడ‌ని తెలుసుకున్న ఓ వివాహిత‌.. భ‌ర్త ఇష్ట‌ప‌డుతున్న మ‌హిళ‌తో క‌లిసి పెళ్లిచేసేందుకు ఒప్పుకుంది. ఇలాంటివి మ‌నం సినిమాల్లోనే చూస్తుంటాం.. కానీ నిజ జీవితంలో కూడా ఇది జ‌రిగింది.

మ‌ధ్యప్రదేశ్‌‌ రాజధాని భోపాల్‌లో వెలుగు చూసిందీ ఘటన. మ‌న చ‌ట్టాల ప్ర‌కారం కానీ ఒక వ్య‌క్తికి ఇద్ద‌రు భార్య‌లు ఉండ‌కూడదు. అయితే ఇక్క‌డ పెళ్లైన ఓ లాయ‌ర్‌కు అంత‌కుముందే త‌న క్లైంట్‌తో ప్రేమ వ్య‌వ‌హారం ఉంది. ఈ విష‌యం పైళ్లైన మూడేళ్ల‌కు ఆ లాయ‌ర్ భార్య‌కు కూడా తెలిసింది. అయితే వీరిద్ద‌రి ప్రేమ గురించి తెలిసినా ఆమె ఏమీ అన‌లేదు. త‌న భ‌ర్త సంతోషంగా ఉండాల‌ని ఆ ప్రియురాలికి ఇచ్చి వివాహం చేయాల‌ని అనుకుంటోంది. చ‌ట్ట ప్ర‌కారం విడాకులు ఇవ్వ‌డానికి ఆమె ముందుకు వ‌చ్చింది. అతడు మా ఇద్దరితో వివాహ సంబంధలో ఉండేందుకు ఇష్టపడుతున్నాడు. కాకపోతే ఇది చట్ట ప్రకారం సాధ్యం కాద‌ని అంటోంది.

కాగా భ‌ర్త‌కు విడాకులు ఇస్తున్న మ‌హిళ‌ల‌పై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే.. మ‌రికొంద‌రు ఆగ్ర‌హంగా మాట్లాడుతున్నారు. ఆమె త్యాగం వెల‌క‌ట్ట‌లేనిది అంటూ కొంద‌రు పొగుడుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం అతడికి ప్రేయసి ఉండగా వేరే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆమె కూడా వదిలేస్తే తిక్క కుదురుతుందని అంటున్నారు. కాగా ఇలాంటివి త్యాగం అనిపించుకోవని.. మూర్ఖ‌త్వం అనిపించుకుంటాయ‌ని స‌ద‌రు మ‌హిళ‌పై మండిప‌డుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here