ఏపీలో అక్ర‌మంగా ఆధార్‌కార్డుల్లో మార్పులు చేస్తున్న వ్య‌క్తులు అరెస్ట్‌..

ఆధార్ కార్డుల్లో అక్ర‌మాల‌పై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల కోసం ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకొంటున్నార‌న్న ఫిర్యాదులు ఎక్కువ‌య్యాయి. దీంతో ప్ర‌భుత్వం పింఛ‌న్ ద‌ర‌ఖాస్తుల్లో మార్పులు తీసుకొచ్చింది.

విజ‌య‌వాడ‌లో పోలీసులు ఆధార్ కార్డులు మార్పులు చేస్తున్న స్థావ‌రాల‌పై దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫేక్‌ ఆధార్‌ కార్డు తయారీ ముఠా అరెస్ట్‌ చేశామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. ఈ కేసులో జిల్లాలో ఆరుగురు అరెస్ట్‌ చేశామని, పరారీలో మరికొందరు నిందితులున్నారని ఎస్పీ ప్రకటించారు. రూ. 5 వేలకు నకిలీ ఆధార్‌ కార్డు ముఠా తయారు చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. గుడివాడ, తిరువూరులో ఆధార్‌ కార్డును ట్యాంపరింగ్‌ చేస్తున్నట్టు గుర్తించామని, సంక్షేమ పథకాల కోసం అక్రమాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రవీంద్రనాథ్‌బాబు హెచ్చరించారు.

దీంతోపాటు తిరువూరులో ఆధార్ కేంద్రంలో పోలీసులు త‌నిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఆధార్ కార్డు మరియు పాన్‌కార్డ్ డేటా బేస్‌లలో వయస్సు మార్పులు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనర్హులకు లబ్ది చేకూర్చి ప్రభుత్వ ఆదాయానికి నిర్వాహకులు గండికొట్టారు. ఆధార్ సెంటర్ నిర్వాహకుడు మరియు అతనికి సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు ప్రకటించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ కూడా కొత్తగా పింఛ‌న్ అప్లై చేసుకునే వారు ఆధార్‌కార్డుకు సంబంధించిన అప్‌డేట్స్ లిస్టు కూడా ఇవ్వాల‌ని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here