చిరంజీవి సినిమాలో బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్‌..?

బిగ్‌బాస్ షో ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె బిగ్‌బాస్ 4 సీజ‌న్ కంప్లీట్ అ య్యింది. ఫైన‌ల్ విజేత‌గా అభిజీత్ నిలిచిన విష‌యం తెలిసిందే. అయితే ఇదే సమ‌యంలో ఫైన‌ల్ ప్రోగ్రాంకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వ‌చ్చి సంద‌డి చేశారు.

కార్య‌క్ర‌మంలో భాగంగా కంటెస్టెంట్ మెమ‌బూబ్‌కు చిరంజీవి రూ. 10 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తాన‌ని చెప్పారు. స్పాట్‌లోనే చెక్కు రాసి ఇచ్చారు. అయితే ఇప్పుడు మ‌రో వార్త వైర‌ల్ అవుతోంది. తాజాగా మెగాస్టార్ నటిస్తున్న సినిమా ఆచార్య‌లో మెహ‌బూబ్‌కు అవ‌కాశం ఇచ్చార‌ని టాక్ న‌డుస్తోంది. అయితే ఇందులో నిజ‌మెంతో తెలియ‌డం లేదు. ఒక‌వేళ మెహ‌బూబ్‌కు అవ‌కాశం వ‌స్తే నిజంగా ఆయ‌న అదృష్టం చేసుకున్న‌ట్లే అని అంతా అనుకుంటున్నారు. ఇక కంటెస్టెంట్ దివికి కూడా చిరంజీవి మ‌రో సినిమాలో అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పారు. అంతేకాకుండా సోహైల్ సినిమాలో ఓ చిన్న క్యారెక్ట‌ర్ కూడా చేస్తాన‌ని చెప్పాడు. మొత్తానికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఇప్పుడు మంచి ఆఫ‌ర్ కొట్టేస్తున్నార‌ని అనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here