సుడిగాలి సుధీర్ సినిమా షూటింగ్‌లో గొడ‌వ‌..

సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచితుడు. జ‌బ‌ర్ద‌స్త్‌, ఢీ షోల‌లో న‌టిస్తూ సుధీర్ బాగా పాపుల‌ర్ అయ్యారు. ఇటీవ‌ల ఆయ‌న సినిమాలు కూడా తీస్తున్నారు. తాజాగా ఆయ‌న సినిమా షూటింగ్‌లో గొడ‌వ జ‌రిగింద‌ని తెలుస్తోంది.

సుధీర్ హీరోగా సాంబశివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కబోయే చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ చిత్రంతో సుధీర్‌ని హీరోగా పరిచయం చేసిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలోనే ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. సినిమా షూటింగ్ మ‌ల‌క్‌పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని బీ బ్లాక్ కాల‌నీలో జ‌రుగుతుంది. అయితే కరోనా స‌మ‌యంలో షూటింగ్ ఏంట‌ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. కాగా సినిమా షూటింగ్‌కు ప‌ర్మిష‌న్ ఉంద‌ని చెప్ప‌డంతో వివాదం ముగిసిపోయింది. సుడిగాలి సుధీర్ వచ్చాడ‌ని తెలియ‌డంతో చుట్టుప్ర‌క్క‌ల ఉన్న యూత్ మొత్తం అక్క‌డ‌కు చేరుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here