క‌రోనా నుంచి కోలుకున్న హీరోయిన్ ర‌కుల్ ఏమ‌న్నారో తెలుసా..

ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఆమెకు క‌రోనా సోకడంతో అభిమాన‌లు ఆవేద‌న చెందారు. అయితే ఇప్పుడు ర‌కుల్ క‌రోనా నుంచి కోలుకున్నారు. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించారు.

ర‌కుల్ ఏమ‌న్నారంటే.. తాజాగా చేయించుకున్న పరీక్షలో నాకు కరోనా నెగిటివ్ వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నా. ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నా. మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు. వచ్చే సంవత్సరాన్ని మంచి ఆరోగ్యంతోనూ, ఆశావహ దృక్పథంతోనూ ప్రారంభిస్తా. అందరూ బాధ్యతగా ఉండండి. మాస్కులు ధరించడంతోపాటు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల‌ని ఆమె కోరారు.

ఇదిలా ఉంటే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. అయితే త‌న‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని చ‌ర‌ణ్ తెలిపారు. త్వ‌ర‌లోనే ఆరోగ్యంగా తిరిగి వ‌స్తాన‌ని చెప్పారు. ఇండ‌స్ట్రీలో త‌మ అభిమాన హీరోలు, హీరోయిన్ల‌కు క‌రోనా సోక‌డంతో అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here