ర‌జినీకాంత్ పార్టీ వాయిదా వేయ‌డం వెనుక కీల‌క ప‌రిస్థితులు…

దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ రాజ‌కీయ పార్టీ ఇంకా ఆల‌స్య‌మైంది. ఇటీవ‌ల ఆయ‌న అనారోగ్య కార‌ణాల రిత్యా హైద‌రాబాద్లోని అపోలో హాస్పిట‌ల్‌లో చేరిన విష‌యం తెలిసిందే. అయితే హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన త‌ర్వాత ర‌జినీ చెన్నై వెళ్లిపోయారు.

రేపు పార్టీ గురించి ప్ర‌క‌టిస్తార‌ని అంతా అనుకున్నారు. అయితే అంత‌లోపే ర‌జినీ ట్విట్ట‌ర్లో కీల‌క పోస్టు పెట్టాడు. తాను రాజ‌కీయ పార్టీ పెడతానని అయితే అది ఇప్పుడే కాద‌న్నారు. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల పార్టీ ఆలోచ‌న‌ను తాత్కాలికంగా విర‌మించుకున్న‌ట్లు ర‌జినీ తెలిపారు. ఈ మేర‌కు మూడు పేజీల లేఖ‌ను ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పెట్టారు. ఈ నిర్ణ‌యం వెనుక ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌లే కార‌ణంగా తెలుస్తోంది. ఈమేర‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల సూచ‌న మేర‌కు ర‌జినీ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని టాక్‌.

ఈ నెల 31వ తేదీన పార్టీ ప్ర‌క‌టిస్తాన‌ని ర‌జినీ కాంత్ ఇదివ‌ర‌కే చెప్పారు. దీన్నిబ‌ట్టి క‌చ్చితంగా పార్టీ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఊహించ‌ని విధంగా ర‌జినీ పార్టీ నిర్ణ‌యాన్ని వాయిదా వేశారు. దీంతో ప‌లువురు ఫ్యాన్స్ నిరాశ‌కు గుర‌య్యారు. అయితే కొంత మంది మాత్రం ఆయ‌న ఆరోగ్య‌మే ముఖ్య‌మ‌ని చెబుతున్నారు. ఏదిఏమైనా త‌మిళ‌నాడు పాలిటిక్స్‌లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా రజినీ రాజ‌కీయ పార్టీ అంశం ఉండింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here