చంద్ర‌బాబు చేసిన త‌ప్పిదాలు ఇప్పుడు పోల‌వ‌రానికి శాపం

అమ‌రావ‌తి: పోలవరం…ఏపీకి వరం అయిందో కాదో తెలియదు కానీ..గత ఐదేళ్లలో చంద్ర‌బాబు పాలిట, ఆయన కాంట్రాక్టర్ల పాలిట వరంగా మార్చేసుకున్నారు. టీడీపీ పాల‌న‌లో ప్రతి సోమవారం పోలవరంగా ప్రకటించి…2018 కల్లా పోలవరం నీళ్లు పారిస్తా అని చెప్పి ఊరించాడు. నిర్మాణ పనులు తొలి దశ దాట‌లేదు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అడ్డగోలుగా ఎస్టిమేషన్లు పెంచేసారు..చంద్ర‌బాబు. పోలవరం పనుల్లో అంతులేని దోపిడీ జరిగింది అని సెప్టెంబర్ 19 , 2018 న అని కాగ్ (కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ) రిపోర్ట్ ఇచ్చింది. పోలవరంను ఏటీఎం లాగా బాబు వాడుకున్నాడు అని ప్రధాని మోడీ ఎన్నికల సభల్లో కూడా ఆరోపించారు. గత బాబు ప్రభుత్వం. చంద్ర‌బాబు చేసిన త‌ప్పిదాలు ఇప్పుడు పోల‌వ‌రానికి శాపంగా మారాయి.

స‌మ‌యం వృథా..అద‌న‌పు వ్య‌యం…‌
పోలవరం స్పిల్ వే బ్రిడ్జి లో దాదాపు 14 బ్లాకులలో ట్రూనియన్ భీంల కోన్ లు ఫెయిల్ అయ్యాయి. ఎగువ కాఫర్ ఢ్యాం నిర్మించడం వల్ల గ్యాఫ్-1 అప్రోచ్ ఏరియా మొత్తం కోతకు గురైంది. ఎగువ కాఫర్ ఢాం నిర్మించడం వల్ల 2019, 2020 రెండు సీజన్లలోనూ వరదలు స్పిల్ వే మీదుగా రావడం వల్ల స్పిల్ ఛానెల్ పనులకు, స్పిల్ వే పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడి విలువైన సమయాన్ని కోల్పోవలసి వచ్చింది. స్పిల్ ఛానెల్ లో నిలిచిపోయిన వరద నీటిని తోడటానికి దాదాపు 2నెలల సమయం పట్టడం వల్ల ప్రతి సంవత్సరం సమయం వృధా అవ్వడం తో పాటు ఇదొక అదనపు వ్యయం.

కాఫ‌‌ర్ డ్యాం నిర్మించ‌డం వ‌ల్లే..
నిబంధనలకు విరుద్ధంగా గ‌త ప్ర‌భుత్వం కాఫ‌ర్ డ్యాం నిర్మించడం పెద్ద తప్పిదంగా మారింది. 2019, 2020 సంవత్సరాలలో గోదావరికి వచ్చిన భారీ వరదల వల్ల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న గ్రామాల ప్రజలకు పంటనష్టం, ఆస్తి నష్టం భారీ ఎత్తున జరిగింది. ఇదంతా చంద్ర‌బాబు అండ్ కంపెనీ ఆధ్వ‌ర్యంలో నిబందనలకు విరుద్దంగా కాఫర్ ఢ్యాం నిర్మించడం వల్లనే జ‌రిగింది. ఈ రెండు సంవత్సరాలలో వరదల వల్ల నష్టపోయిన వారికి ఒక్కరూపాయి కూడా చంద్ర‌బాబు కాంట్రాక్టు కంపెనీ త‌ర‌ఫున నష్టపరిహారం అందలేదు. ముఖ్యంగా నిర్మాణం, ప్రణాళికలో అనాలోచిత నిర్ణయాలు, నాన్ ఇంజనీరింగ్ పద్దతులు అవలంబించడం చంద్ర‌బాబు చేసిన ద్రోహం

ఏటీఎంలా వాడుకున్న చంద్ర‌బాబు
పోల‌వ‌రాన్ని చంద్ర‌బాబు ఏటీఎంలా వాడుకున్నారు. స్పిల్ వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యాం, ఇతర నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టడం సోమ‌వారాన్ని పోల‌వ‌రంగా వాడుకున్న చంద్ర‌బాబుకే చెల్లింది. ఎగువ,దిగువ కాఫర్ డ్యాంలు నిర్మాణాలు కూడా అసంపూర్తిగా నిర్మించడం కూడా చంద్ర‌బాబు గొప్ప‌గా చెప్పుకున్నారు అప్ప‌ట్లో. సహాయం పునరావాసం పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం మ‌రో లోపం. అప్రోచ్ ఛానెల్,పైలెట్ ఛానెల్ పనులుకు ఆటంకం ఏర్పడటం కూడా గ‌త ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల్లో భాగ‌మే.

న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వ‌కుండానే..
మూలలంకలో డంప్ యార్డ్ కోసం 2 పంటలు పండే 203 ఎకరాల భూమిని నష్టపరిహారం ఇవ్వకుండానే బలవంతంగా తీసుకోవడం కూడా చంద్ర‌బాబు నాయుడు కంపెనీ ప‌నే. డంప్ యార్డ్ సమీపంలోని డ్రైనేజ్ కాలువ పూడిపోయినా ఇప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి చంద్ర‌బాబు నాయుడు కంపెనీ స‌మాధానం చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పోలవరంలో హాస్పటల్, కాలేజ్ లను అభివృద్ది చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ పట్టించుకోకపోవడం చంద్ర‌బాబు కాంట్రాక్టు కంపెనీ పనే.

పోల‌వ‌రం పనులను ప‌రుగులు పెట్టిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్‌
ఆంధ్రప్రదేశ్‌ వరప్రధాయినిగా పేరొందిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ ప‌రుగులు పెట్టిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలతో ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇటీవ‌ల పోలవరం ప్రాజెక్టు గేట్లకు హైడ్రాలిక్ సిలెండర్లను ఏర్పాటు చేశారు. రికార్డు వేగంతో పనులు పూర్తి చేస్తున్న మెఘా ఇంజనీరింగ్ సంస్థ..జర్మనీకి చెందిన మౌంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి భారీ సిలిండర్లను దిగుమతి చేసుకున్నారు. ఈ సిలిండర్లను అమర్చేందుకు మౌంట్ హైడ్రాలిక్ ఇంజనీర్లు ఏపీకి రాగా.. పోలవరం ప్రాజెక్టులో హైడ్రాలిక్ సిలిండర్ల ఏర్పాటును ప్రారంభించారు. ఇప్పటికే విజయవంతంగా మొదటి గేటుకు హైడ్రాలిక్ సిలిండర్‌ను ఏర్పాటు చేశారు. అయితే, రేడియల్ గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చడం దేశంలో ఇదే తొలిసారి.

ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్ సిలిండ‌ర్లు..
ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్ సిలిండర్లను ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ లెక్కన 48 గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చనున్నారు. ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ పొడవు 17.308 మీటర్లు ఉండగా.. దాని బరువు దాదాపుగా 20 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఇక హైడ్రాలిక్ టెక్నాలజీతో గేట్లను ఎత్తడం దేశంలోనే పోలవరంలో మొదటిసారి. ఈ హైడ్రాలిక్ సిలిండర్ల సాయంతో నిమిషానికి అర మీటరు చొప్పున గేటును ఎత్తే అవకాశం ఉంటుంది. ఇక పోలవరం ప్రాజెక్టు రేడియల్ గేట్లకు 24 పవర్ ప్యాక్ సెట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పవర్ ప్యాక్ సాయంతో రెండు గేట్లను ఎత్తవచ్చు. ఇప్పటికే వపర్ ప్యాక్ రూమ్‌ను మెఘా సంస్థ ప్రారంభించింది. మరోవైపు స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు ఏర్పాటు చేయడం కూడా పూర్తయ్యింది. గడ్డర్లు పని పూర్తికావడంతో ఇప్పుడు హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చే పనులను ప్రారంభించారు. అనుకున్న స‌మ‌యానికి పోల‌వ‌రం ప‌నులు పూర్తి చేసి ఆయ‌క‌ట్టుకు నీరివ్వాల‌న్న సంక‌ల్పంతో ప్ర‌భుత్వం అడుగులు ముందుకు వేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here