ఆయుర్వేద ఆసుపత్రుల్లో క‌రోనా చికిత్సపై ప్ర‌భుత్వం ఏం చెప్పిందంటే..

ఆయుర్వేద చికిత్స‌ల‌కు ఈ మ‌ధ్య బాగా జ‌నం ఇష్ట‌ప‌డుతున్నారు. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌ల జీవ‌న‌శైలి పూర్తిగా మారిపోయింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు కావాల్సిన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మామూలు వైద్యంతో పాటూ హోమియోవైద్యం కూడా ప్ర‌జ‌ల‌కు అందించాల‌ని అనుకుంటున్నారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని ఆయుర్వేద జిల్లా ఆసుపత్రుల్లో పోస్ట్ కొవిడ్ కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్రసర్కారు తాజాగా నిర్ణయించింది. ఆయుర్వేద జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కొవిడ్ పోస్ట్ కేంద్రాలను ప్రారంభించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాల్లో కరోనా సోకకుండా రోగనిరోధకశక్తిని పెంచడానికి ఈ కేంద్రాలు సహాయపడనున్నాయి. అన్ని జిల్లా ఆయుర్వేద ఆసుపత్రుల్లో పోస్ట్ కొవిడ్ కేంద్రాలు తెరుస్తామని, ఈ కేంద్రాల్లో రోగులకు హోమియోపతిక్, ఆయుర్వేద, యునానీ వైద్య విధానాల ద్వారా నిపుణులు చికిత్స చేస్తారని రాజస్థాన్ ఆయుర్వేద శాఖ మంత్రి రఘుశర్మ చెప్పారు.

‘‘కరోనా వ్యాప్తి సమయంలో ప్రపంచం మొత్తం ఆయుష్ విధానాన్ని విశ్వసించింది. కరోనావైరస్ రోగికి చికిత్స చేయడానికి ఏ వైద్య విధానంలోనూ చికిత్స కనుగొనలేదు, ఆయుర్వేద వైద్యవ్యవస్థ వల్ల సానుకూల ఫలితాలు రావడంతో ఆయుర్వేదాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రఘుశర్మ చెప్పారు. హోమియోపతి, యునానీ వైద్యవిధానాలను మెరుగుపర్చేందుకు తాము కృషి చేస్తామని మంత్రి ప్రకటించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని 17 ప్రాంతాల్లో బొటానికల్ గార్డెన్లను అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రతీ ఆయుష్ ఆసుపత్రిలో 10 రకాల గుగ్గల్, తులసీ, గిలోయ్, అశ్వగంధ, అర్జున్, ఇతర ఔషధ మొక్కలను నాటాలని మంత్రి రఘుశర్మ ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here